నవంబర్ 15లోగా పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లించాలి – డిఈఓ గోవిందరాజులు

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో నవంబర్ 2 జనంసాక్షి :
2022-23 విద్యా సంవత్సరానికిగాను 2023 మార్చి మాసంలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజును నవంబర్ 15లోగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ యం. గోవిందరాజులు బుధవారం ఒక ప్రకటనలో కోరారు.
ఈ విద్యా సంవత్సరం నాగర్ కర్నూలు జిల్లాలో10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులంతా ఎలాంటి అపరాద రుసుం లేకుండా నవంబర్ 15లోగా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు.
 రూ. 50 అపరాద రుసుంతో నవంబర్ 30వ తేదిలోగా, రూ.200ల అపరాద రుసుంతో డిసెంబర్ 15వ తేదీలోగా, రూ.500లు అపరాద రుసుంతో డిసెంబర్ 29వ తేదీలోగా పరీక్ష ఫీజును చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.
రెగ్యులర్‌ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125, ప్రైవేటు విద్యార్థులు 3 సబ్జెక్టుల వరకు రూ.110, మూడు సబ్జెక్టులకంటే ఎక్కువ ఉంటే రూ. 125 చెల్లించాలని సూచించారు. వివరాలకు బీఎస్‌ఈ.తెలంగాణ వెబ్‌సైట్‌లో చూడాలని ఆయన కోరారు.
జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థుల నుండి పరీక్ష ఫీజు తీసుకొని నవంబర్ 17లోగా ఎస్బిఐ బ్యాంకుల్లో జమ చేయాలన్నారు.
పదవ తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్ ను నవంబర్ 19 తేదీ నుంచి నవంబర్ 24వ తేదీలోగా నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని ఆయన కోరారు.