నవంబర్ 3న చలో ఢిల్లీ ని జయప్రదం చేయండి
కరీంనగర్ టౌన్ అక్టోబర్ 14(జనం సాక్షి)
భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా నవంబర్ మూడో తారీఖున జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి తిరుపతి కార్యకర్తలకు, యువతకు పిలుపునిచ్చారు.
నగరం లోనీ తెలంగాణ చౌకులో చలో ఢిల్లీ జయప్రదం చేయాలని పోస్టర్లను తిరుపతి ఆవిష్కరించారు. అనంతరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ పటేల్ తిరుపతి మాట్లాడుతూ మోడీ ఆలంబిస్తున్న ప్రజా, యువజన వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ, మోడీ యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చిన మోడీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ వేయకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలు ఊడబీగుతున్నాడని, ప్రభుత్వ రంగ సంస్థలను అత్యంత తక్కువ ధరలకు కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తూ యువతలో ఉన్న చిన్న ఆశను కూడా చంపేస్తున్నాడని ఆయన అన్నారు.మోడీ ఈ 8 ఏళ్ల పాలనలో యువతకు ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు.
దేశంలో జాతీయ ఉన్మాదాన్ని ప్రేరేపించి యువతను రెచ్చగొట్టి, మతం పేరుతో కులం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రాంతీయ తగాదాలు పెడుతూ పబ్బం వెళ్లబుచ్చుతున్నాడని ఆయన అన్నారు. ఇట్లాంటి పాలకుల పైన యువత తిరుగుబాటు చేయాలని యువతకు పిలుపునిచ్చారు.
అందుకే వేర్ ఇస్ మై జాబ్ అంటూ ఢిల్లీలో గర్జించేందుకు , మోడీ కళ్ళు తెరిపించేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్లు అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో భారీ యువజన ర్యాలీ నిర్వహించనున్నట్లు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయునట్లు ఆయన సందర్భంగా తెలియజేశారు.
యువజనుల సత్తా చూపేందుకు ఈ ర్యాలీకి, ధర్నాకు ఎక్కువమంది యూత్ కదిలి రావాలని ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రాజు నవీన్ నాయకులు అజయ్ రఘు సునీల్ అరుణ్ తిరుపతి సాయి వంశీ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.