నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
…ఏఐకేఎంఎస్ మండల కార్యదర్శి దేవా నాయక్
తహసీల్దార్ వినతి పత్రం
పెద్దవంగర,అక్టోబర్ 21(జనం సాక్షి ) ఈ సంవత్సరం అకాల వర్షాలకు అధిక నష్టపోయింది రైతు లు మరియు పంట పత్తి, మిర్చి,మొక్కజొన్న నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అఖిలభారత రైతు కూలి సంఘం మండల కార్యదర్శి ధరావత్ దేవా నాయక్ అన్నారు.శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం నందు వినతిపత్రం అందజేశారు.అనంతరం మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించి రైతుల పంటలు నష్టం జరుగుతున్నప్పటికీ వ్యవసాయ అధికారులు పరిశీలించకపోవడం రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహించడం సబబు కాదని అన్నారు. రైతుల పంటలకు పత్తి,మిర్చి,మొక్కజొన్న ఎకరాకు 30 వేల నుండి 40 వేల వరకు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు దేవేందర్,బిక్షం,వెంకన్న,శంకర్, తదితరులు పాల్గొన్నారు
Attachments area
ReplyForward
|