నాగరాల ప్రాథమిక పాఠశాలలో శ్రీరంగాపూర్ మండల పాఠశాల సముదాయ సమావేశం
శ్రీరంగాపురం ఆగస్ట్ 29 (జనంసాక్షి):
నేడు నాగరాల ప్రాథమిక పాఠశాలలో శ్రీరంగాపూర్ మండల పాఠశాల సముదాయ సమావేశాన్ని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ కురుమన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశంలో మండలంలోని 50 శాతం ఉపాధ్యాయులు హాజరై తమ పాఠశాలల్లోని ఉత్తమ బోధన అనుభవాలను అందరితో పంచుకున్నారు. సముదాయ సమావేశ అజెండాలోని అంశాలైన తొలిమెట్టు లక్ష్యాలు, బేస్లైన్ టెస్ట్ పై సమీక్ష, కనీస అభ్యసన సామర్థ్యాలు, అభ్యసన ఫలితాలను స్పృశించేలా తెలుగు, గణితం, ఆంగ్లం లో మాదిరి పాఠ్యాంశాలు, పి టి ఎ సమావేశాలు, నో బ్యాగ్ డే, రీడ్ కార్యక్రమంపై కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కురుమన్న గారు, అసిస్టెంట్ సెక్రటరీ రాజు గారు, హాజరైన ఉపాధ్యాయులు లోతైన చర్చ నిర్వహించారు.
సమావేశాన్ని ఉద్దేశించి ఉమ్మడి మండల విద్యాధికారి గౌరవనీయులు శ్రీ జయరాములు గారు మాట్లాడుతూ నాగరాల పాఠశాల పరిసరాలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయని, ఉపాధ్యాయుల సమిష్టిగా కృషి చేసి ప్రజాప్రతినిధులు, దాతల సహాయంతో పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దారాన్నారు. పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యులైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కంటే వెంకటస్వామి గారిని, శ్రీమతి రేణుక గారిని, శ్రీ సురేష్ గారిని, శ్రీ నరేష్ గారిని, శ్రీ నరసింహ గారిని అభినందించారు. సమర్థవంతంగా కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ: నోడల్ అధికారిణి శ్రీమతి వరలక్ష్మి కాంప్లెక్స్ సమావేశాలు చాలా ప్రభావవంతంగా నిర్వహిస్తున్నారని, ఉపాధ్యాయులందరూ చర్చలో పాల్గొనడం శుభ పరిణామం అన్నారు.
సమావేశం అనంతరం నాగరాల ఉపాధ్యాయ బృందం సమావేశంలో పాల్గొన్న మండల విద్యాధికారి శ్రీ జయరాములు గారిని, కాంప్లెక్స్ ప్రధానోధ్యాయులు శ్రీ కురుమన్న గారిని, నోడల్ అధికారిణి శ్రీమతి వరలక్ష్మి గారిని పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఇట్టి కార్యక్రమానికి నాగరాల గ్రామ సర్పంచ్ శ్రీమతి నిర్మల రాధాకృష్ణ గారు, వైస్ ఎంపిపి శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పి శ్రీమతి శ్రీలత గారు హాజరయ్యారు.