నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి న్యూస్

-ముఖ్యమంత్రి కేసీఆర్,అల్లం నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన జర్నలిస్టులు.
-సుప్రీంకోర్టు తీర్పు జర్నలిస్టు సమాజానికి శుభ పరిణామం.
– సుధీర్గ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యకు పరిష్కారం.
– జర్నలిస్టుల ఇల్లు ఇళ్ల స్థలాల పై తొలగిన అడ్డంకులు.
– సుప్రీం కోర్టులో కేసు పరిష్కారం అయ్యేందుకు కృషిచేసిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు.
– చొరవ చూపిన అల్లం నారాయణ కు ప్రత్యేక అభినందనలు.
– జర్నలిస్టు సంఘాల రాష్ట్ర నాయకులు అబ్దుల్లా ఖాన్,దినకరరావు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు26(జనంసాక్షి):
జర్నలిస్టులకు ఇండ్లు,ఇండ్ల స్థలాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలో అనుకూలంగా తీర్పు ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టు సమాజానికి శుభ పరిణామమని జర్నలిస్టు సంఘాల రాష్ట్ర నాయకులు అబ్దుల్లా ఖాన్, దినకర్ రావు, జెమినీ సురేష్, టీ న్యూస్ శేఖరా చారి,కందికొండ మోహన్, నాగర్ కర్నూల్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు అహ్మదుల్లా ఖాన్ అన్నారు. సుప్రీంకోర్టు జర్నలిస్టులకు ఇండ్లు,ఇండ్ల స్థలాలను కేటాయించాలని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ని అంబేద్కర్ కూడలిలో యూనియన్లకు అతీతంగా జర్నలిస్టు లు ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ గత 12 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు లో జర్నలిస్టులకు సంబంధించిన ఇండ్లు, ఇండ్ల స్థలాల కేసు పెండింగ్ లో ఉండడం వల్ల అర్హత కలిగిన జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు దక్కలేదని అన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయ ణ సారథ్యంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మీడియా అకాడమీ బాధ్యులు,జర్నలిస్టు సంఘాల నాయకులు ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసి సుప్రీంకోర్టులో కేసును పరిష్కరించే విధంగా చొరవ చూపాలని అడిగిందే తడవుగా ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయవాదులను నియమించి జర్నలిస్టుల ఇండ్లు,ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేశారన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ తో కూడిన ధర్మాసనం చిన్న స్థాయిలో తక్కువ జీతాలతో జీవనం సాగిస్తున్న జర్నలిస్టుల ఇండ్లు,ఇండ్ల ఇల్లాసలాలకు అడ్డంకులు తొలగించే విధంగా తీర్పునివ్వడం తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టు సమాజానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. జర్నలిస్టు సమాజం సుప్రీం కోర్టు తీర్పుకు రుణపడి ఉంటామని, జర్నలిస్టుల ఇండ్లు,ఇండ్ల స్థలాల కోసం కృషిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కు జర్నలిస్టు సంఘాల బాధ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఉమాశంకర్, పుట్టపాగ వెంకటస్వామి, తిప్పర్తి విజయ్, సురేష్ రావు, సాయిలు సాగర్, చంద్రశేఖర్ రావు,సందు యాదగిరి, బాదం పరమేశ్వర్, సత్యం, భూదానం రామకృష్ణ, రాజేష్ గౌడ్, యాదయ్య,ప్రదీప్ లతోపాటు నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు పాల్గొన్నారు.