నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో

జాతీయస్థాయి మహిళ మాస్టర్స్ అతల్టిక్ పోటీల్లో సత్తా చాటిన మహిళ వ్యాయామ ఉపాధ్యాయులు

• అభినందించిన డిఈవో గోవిందరాజులు
నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో నవంబర్ 10 జనం సాక్షి:
ఈనెల 4వ తేదీ నుంచి6తేదీ వరకు హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన
నేషనల్ విమెన్’స్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన మహిళ వ్యాయామ ఉపాధ్యాయులు సత్తా చాటారు.
మణి జడ్.పి.హెచ్.ఎస్ బల్మూరు ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు లాంగ్ జంప్ లో రెండవ బహుమతి, డి సుభాషిని శ్రీపురం జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు 4×100 మీటర్స్ రన్నింగ్ లో రెండోవ బహుమతి, చంద్రకళ వ్యాయామ ఉపాధ్యాయురాలు మన్ననూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల జావిల్లింగ్ త్రోలో రెండో బహుమతి సాధించింది.
అదేవిధంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొల్లాపూర్ లక్ష్మి వ్యాయామ ఉపాధ్యాయురాలు లాంగ్ జంపులో మొదటి బహుమతి సాధించిన మహిళ వ్యాయామ ఉపాధ్యాయులకు గురువారం డిఈవో గోవిందరాజులు ప్రసాద్ గౌడ్లు శాల్వాతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ…..
పనిచేస్తున్న పాఠశాలల్లో విద్యార్థినిలకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించి రాష్ట్రస్థాయి జాతీయస్థాయిలో పాలు పంచుకునేలా కృషి చేయాలన్నారు.