నాగారం అర్బన్‌ ఫారెస్ట్‌ ప్రారంభం

మొక్కలు నాటిన మంత్రులు ఇంద్రకరణ్‌, సబిత

రంగారెడ్డి,జూలై28(జనంసాక్షి ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నాగారం అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎనిమిదో విడత హరితహారంలో భాగంగా మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా నగరాలకు, పట్టణాలకు దగ్గర్లో ఉండే రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతాల్లో అర్బన్‌ లంగ్‌ స్పేస్‌లుగా అర్భన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు హైదరాబాద్‌కు నలువైపులా వీటిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు 7 కిలోవిూటర్ల దూరంలో మహేశ్వరం మండలం పెద్దపులి నాగారంలో 556. 69 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.8.17 కోట్ల వ్యయంతో నాగారం అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌ను అభివృద్ధి చేశామన్నారు. ఎంట్రీ ఎª`లాజా, విజిటర్స్‌ పాత్వే, సఫారి ట్రాక్‌, గజేబో, వాచ్‌ టవర్‌, గ్యాప్‌ ఎª`లాంటేషన్‌, అటవీ ప్రాంతం అంతా రక్షణ గోడ (చైన్‌ లింక్‌ ఫెన్సింగ్‌, సీ త్రూ వాల్‌), బోర్‌ వెల్‌, పైప్‌ లైన్‌, ఇతర సౌకర్యాలను కల్పించామని తెలిపారు.