నాచారం లో బతుకమ్మ చీరల పంపిణీ

నాచారం(జనంసాక్షి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నాచారంలో కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ ప్రారంభించారు. నాచారంలోని మూడు కేంద్రాలలో ఒకటి అన్నపూర్ణ కాలనీ కమ్యూనిటీ హాల్ , భవాని నగర్ కమ్యూనిటీ హాల్ అలాగే ఎర్రగుంట లోని లాల్ బహుదూర్ శాస్త్రి కమ్యూనిటీ హాళ్లలో ఈ నెల 27 వరకు చీరల పంపిణీ ఉంటుందని కార్పొరేటర్ తెలియజేశారు .ప్రతి ఒక్కరు విధిగా ముందుగానే వచ్చేసి చీరలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు అంజి,  దాసరి కర్ణ,  ప్రీతి రెడ్డి,  శ్రీరామ్ సత్యనారాయణ,  మంగోలి శివ,  రవి , కృష్ణ సాయి,  కెప్టెన్ శివకుమార్ , అజ్మీరా బేగం,  బొడికే శోభ , అసిస్టెంట్ ఇంజనీర్ లింగారావు , వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.