*నాటు సారాయి తయారు, రవాణా, అమ్మకాలు, జరిపే వారిపై కఠిన చర్యలు ఎక్సైజ్ సీఐ రాధ*
…జనం సాక్షి రిపోర్టర్ వెంకటేశ్వర్లు మెట్ పల్లి…
మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 14,
జనంసాక్షి
మెట్పల్లి పట్టణంలో ఎక్సైజ్ సీఐ రాధా పత్రిక సమావేశంలో మాట్లాడుతూ… మెట్పల్లి ఎక్సైజ్ పరిధిలోని మెట్పల్లి మండలం లోని పలు గ్రామాలలో నాటు సారాయి తయారు, రవాణా, మరియు అమ్మకాలపై జగిత్యాల ఏఎస్ఇ చంద్ర బాబు నాయక్ ఆధ్వర్యంలో మెట్పల్లి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు, డిటిఎఫ్ జగిత్యాల అధికారులు కలిసి నిర్వహించిన సంయుక్త దాడులలో కేసీఆర్ తండా ఏఎస్ఆర్ తండా మరియు ఆత్మ నగర్ గ్రామాలకు చెందిన ముగ్గురిపై నాటు సారాయి అమ్ముతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ రాధా తెలిపినారు. ఇట్టి దాడులలో సుమారు 14 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకొని, అలాగే 100 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి ఎక్సైజ్ స్టేషన్, మరియు డిటిఎఫ్ జగిత్యాల అధికారులు ఎస్ అశోక్ కుమార్ ,ఎస్ సమ్మయ్య ,ఎంఏ మజీద్ ,మరియు సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ జాన్సన్ ,కానిస్టేబుల్స్ రామచందర్ ,రవి ,అప్రోజ్, గట్టయ్య, చంద్రశేఖర్ ,తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ రాధా మాట్లాడుతూ ఎవరైనా నాటు సారాయి తయారు రవాణా అమ్మకాలు జరుపుతున్నట్లు తెలిస్తే మాకు సమాచారం అందించి నాటు సారాయి అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరారు