*నాణ్యమైన విద్య వైద్యం ద్వారానే పేదరిక నిర్మూలన*

 ప్రముఖ ఆర్థిక సామాజిక రాజకీయ టీవీ విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం.
కోదాడ, అక్టోబర్ 22(జనం సాక్షి)                          ప్రజల స్వయం సమృద్ధి పెరిగే విధంగా దేశంలో అభివృద్ధి వ్యూహం సంక్షేమ వ్యయం జరగాలి సాంకేతికత, సైన్సు ,విద్య ,దేశంలో ఉత్పత్తి ఉపాధి అవకాశాలును పెంచి, పేదరికం తగ్గేందుకు ఉపయోగపడాలన్నారు. అక్టోబర్ 24 యుఎన్ఓ డే మరియు ఇంటర్నేషనల్  పావర్టీ ఎరాడికేషన్ డే సందర్భంగా  శనివారం నాడు ఎస్ వి డిగ్రీ కళాశాల కోదాడ యందు  జన విజ్ఞాన వేదిక సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరియు ఎస్వి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్తంగా  నిర్వహించిన సెమినార్   “భారత అభివృద్ధి వ్యూహం, సంక్షేమ వ్యయం, పేదరికం “.అనే అంశంపై అందె సత్యంగారు మాట్లాడటం జరిగింది. మనదేశంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన తమిళనాడు పంజాబు గుజరాత్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో 15% పైగానే పేదలు ఉన్నారు కానీ ఆర్థికంగా వెనుకబడి ఉన్న కేరళ రాష్ట్రంలో మాత్రం కేవలం 0.7% పేదలున్నట్లుగా నీతి అయోగ్ రిపోర్ట్ తెలియజేస్తుంది కేరళ రాష్ట్రంలో పేదలు తక్కువగా ఉండటానికి విద్యా వైద్య సదుపాయాలు అధికంగా ఉండటమే కారణమని తెలియజేసినారు. ప్రజలలో మొబిలిటీ సామర్థ్యం శాస్త్రీయత స్వయం సమృద్ధి సాధికారతల ద్వారానే పేదరికం నుండి బయటపడవచ్చునీ ,అందుకు సంక్షేమ పథకాలు దోహదపడాలన్నారు. మనదేశంలో ఇప్పటికీ ప్రభుత్వ లెక్కల ప్రకారం 30 కోట్ల మంది పేదలు ఉన్నారు. అమెరికా బ్రిటన్ దేశాల వైఫల్యాలను పరిగణలోకి తీసుకోవాలి.  మన దేశంలో 13 శాతం మంది ధనికులు చేతుల్లో 75% సంపద ఉందన్నారు .అదాని, అంబానీ లకు దోచిపెట్టె కార్పొరేట్ అభివృద్ధి వ్యూహాలను రద్దు చేయాలన్నారు. ధనిక పేదల మధ్య అంతరాలు తగ్గించే విధంగా పేద మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరిగే విధంగా ప్రభుత్వ విధాన ,సంక్షేమ పథకాలు అమలు జరగాలని కోరారు. దేశంలో కరోనా వలన ఏర్పడిన నిరుద్యోగిత పేదరికం సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వ సంక్షేమ వ్యయం అమలు జరగాలని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సాంకేతికత, శాస్త్రీయతను సమ్మిళితం చేయాలని కోరారు దేశంలో విద్య వైద్యం శాస్త్రీయ దృక్పథం పెరిగే విధంగా యువతలో ఎం పవర్ మెంట్ కోసం ప్రభుత్వం కృషి చేయాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు అధ్యాపకులు జన విజ్ఞాన వేదికలో సభ్యత్వం తీసుకున్నారు.ఇట్టి కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా జనవిజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి శ్రీ రాముల ఆంజనేయులు కార్యదర్శి బడుగుల సైదులు రాష్ట్ర కార్యదర్శులు డిఎన్ స్వామి ఎస్కే జాఫర్ ఎస్ వి  విద్యాసంస్థల చైర్మన్ ముత్తినేని సైదేశ్వర రావు  డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బొబ్బిలి రామకృష్ణారెడ్డి ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రతినిధి  థామస్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు
Attachments area