నాదల్ దే యుఎస్ ఓపెన్
ఆద్యంతం ¬రా¬రీగా ఫైనల్ మ్యాచ్
అద్భుతంగా ఆకట్టుకున్న పోరాడిన తీరు
న్యూయార్క్,సెప్టెంబర్9(జనం సాక్షి ) : యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ కైవసం చేసుకున్నాడు. ¬రా¬రీగా సాగిన టైటిల్ పోరులో నాదల్ 7-5, 6-3, 5-7, 4-6, 6-4 స్కోర్ తో ఐదో సీడ్ రష్యాకు చెందిన డానిల్ మెద్వెదేవ్ ను ఓడించాడు. ఈ విజయంతో నాదల్ తన కెరీర్ లో 19వ గ్రాండ్ శ్లామ్ టైటిల్ ను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అత్యధిక గ్రాండ్ శ్లామ్ టైటిల్స్ రికార్డును రెండడుగుల దూరంలో నిలిచాడు. ఈ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ¬రా¬రీగా సాగింది. తొలిసారి గ్రాండ్ శ్లామ్ ్గ/నైల్ కు చేరిన మెద్వెదేవ్ నాదల్ కు గట్టిపోటీనిచ్చాడు. అంత సులువుగా స్పెయిన్ బుల్ ముందు తలవంచని ఈ రష్యా ఆటగాడు ఐదు సెట్ల పాటు పోరాడాడు. మొదటి రెండు సెట్ లు నాదలే గెలిచి ఆధిక్యంలో ఉన్నప్పటకీ.. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా అద్భుతంగా పోరాడిన తీరు ఆకట్టుకుంది. వరుసగా రెండు సెట్లు గెలిచి స్కోర్ సమం చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారిపోయింది. అయితే మ్యాచ్ డిసైడర్ ఐదో సెట్ లో నాదల్ తన అనుభవంతో పై చేయి సాధించి టైటిల్ గెలిచాడు. విజేతగా నిలిచిన నాదల్ కు 27.59 కోట్లు ప్రైజ్ మనీ లభించగా…. రన్నరప్ మెద్వెదేవ్ కు 13.62 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. కాగా తాజా టైటిల్ గెలవడం ద్వారా స్పెయిన్ బుల్ పలు రికార్డులు అందుకున్నాడు. 30 ఏళ్ళ నిండిన తర్వాత ఐదు మేజర్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఫెదరర్, జకోవిచ్ , రొడ్ లావెర్, కెన్ రోజ్ వాల్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. వీరంతా 30 ఏళ్ళ దాటిన తర్వాత నాలుగేసి టైటిల్స్ సాధించాడు. అలాగే నాదల్ యుఎస్ ఓపెన్ గెలవడం ఇది నాలుగోసారి. గతంలో 2010,2013,2017 లలో విజేతగా నిలిచిన స్పెయిన్ బుల్ 2011లో రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. కెరీర్ లో ఇప్పటి వరకూ 27 గ్రాండ్ శ్లామ్ ్గ/నైల్స్ ఆడిన రఫా 19 ్గ/నైల్స్ గెలిచి, ఎనిమిదింటిలో ఓడిపోయాడు.