నామ్ రోడ్డు పై అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

మొక్కల సంరక్షణ పై శ్రద్ద వహించాలి.  నల్గొండ . జనం సాక్షి .
రహదారి పొడవునా నాటిన మొక్కల సంరక్షణ పట్ల శ్రద్ద వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు .శుక్రవారం నల్గొండ,చిట్యాల,నార్కట్ పల్లి మండలం లలో జిల్లా కలెక్టర్ పర్యటించి అవెన్యూ ప్లాంటేషన్,పల్లె ప్రకృతి వనం,బృహత్ పల్లె ప్రకృతి వనం,మహాత్మా జ్యోతి బా పూలే గురు కుల కళాశాల లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు .నామ్ రోడ్డు ఇరువైపులా అనేపర్తి నుండి ఎల్లారెడ్డి గూడెం వరకు నాటిన మొక్కలు జిల్లా కలెక్టర్ పరిశీలించారు.కొన్ని మొక్కలు వంగి వుండడం గమనించి వెంటనే సరి చేయాలని,పాదులు తీసి సంరక్షణ పట్ల శ్రద్ద వహించాలని సూచించారు        చిట్యాల మండలం వట్టి మర్తి గ్రామం లో పల్లె ప్రకృతి వనం పరిశీలించారు.పల్లె ప్రకృతి వనం నిర్వహణ పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. వెలిమి నేడు గ్రామం లో బృహత్ పల్లె ప్రకృతి వనం సందర్శించి మొక్కల వివరాలు తెలుసుకుని పరిశీలించారు బృహత్ పల్లె ప్రకృతి వనం లో మొక్కల మధ్య పెరిగిన గడ్డి ని తొలగించాలని,బృహత్ పల్లె ప్రకృతి వనం లో నడిచే దారులు పాద చారులు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గ్రామం లో మన ఊరు_ మన బడి కార్యక్రమం కింద ఎంపిక చేసిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఇంకా పనులు మొదలు కాలేదని తెలుసుకున్న కలెక్టర్ వెంటనే పనులు ప్రారంభించాలని సర్పంచ్,పంచాయతీ రాజ్ ఏ. ఈ.లకు ఆదేశాలు జారీ చేశారు. నార్కట్ పల్లి మండలం మూసి ప్రాజెక్ట్ మహాత్మా జ్యోతి బా పూలే వెనుక బడిన తరగతుల గురుకుల కళాశాల ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కళాశాలలో వంట గది,లైబ్రరీ,ఆహారం పరిశీలించారు.కళాశాల లో పరిసరాలు పరిశుభ్రంగా వుంచేలా చర్యలు తీసుకోవాలని,విద్యార్థులకు నాణ్యమైన ఆహారం మెనూ ప్రకారం అందించాలని కోరారు.విద్యార్థుల తో పాటు ప్రిన్సిపాల్,ఉపాధ్యాయులు కూడా భోజనం చేయాలని సూచించారు.జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి విష్ణు వర్ధన్,ఎం.పి.డి. ఓ.లు శ్రీనివాస్ రెడ్డి(నల్గొండ),యాదగిరి గౌడ్ (నార్కట్ పల్లి), లాజర్ (చిట్యాల),ఎం.పి. ఓ.లు,సర్పంచ్,ఉప సర్పంచ్,లు మండల,గ్రామ అధికారులు పాల్గొన్నారు.

తాజావార్తలు