*నాయనమ్మ పై దాడి చేసిన గోవర్ధన్ కు రిమాండ్*

 

 

 

 

పెద్దేముల్ సెప్టెంబర్ 03 (జనం సాక్షి)
సొంత నాయనమ్మ పై విచక్షణ రహితంగా దాడిచేసిన మనువడిని పోలీసులు అదుపులోకి రిమాండ్ కు తరలించినట్లు తాండూర్ రూరల్ సిఐ రాంబాబు వెల్లడించారు. పెద్దేముల్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.పెద్దేముల్ మండలంలోని మంబాపూర్ గ్రామానికి చెందిన సింది గోవర్ధన్ (32)మద్యానికి బానిసై  గత నెల 29 ఆగస్టు 2022 నాడు సమయం మధ్యాహ్నం 1 గంటల సమయంలో తాగడానికి డబ్బులు ఇవ్వాలని తన నాయనమ్మ అయినటువంటి యశోదమ్మను  డబ్బులు కావాలని అడగగా ఆమె తన దగ్గర లేవని చెప్పింది.దాంతో గోవర్ధన్ నాకు డబ్బులు ఇస్తావా లేదంటే చంపేస్తానంటూ తన నాయనమ్మను బెదిరించాడు.అయినా తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో ఆవేశంతో గోవర్థన్ తన నాయనమ్మ అని చూడకుండా ఇష్టంవచ్చినట్టు బూతు మాటలు తిడుతూ,కర్రతో చేతులపై కొట్టి,కాళ్లతో తన్ని యశోదమ్మ దగ్గర ఉన్నటువంటి రూ.2000 లు తీసుకొని పారిపోయాడు.ఈ సంఘటనతో నరేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గోవర్థన్ కోసం ప్రత్యేకంగా గాలింపు జరిపి అతనిని  వికారాబాద్  రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకొని అతనిపై ఐపిసి 386 324 504 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.