నారాయణఖేడ్ మండలంలోని  నిజాంపేట్ గ్రామం లో ఎమ్మెల్యే  పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఖేడ్ ఎమ్మెల్యే ఎం భూపాల్ రెడ్డి

నారాయణఖేడ్ జూన్10(జనం సాక్షి)

శుక్రవారం ఖేడ్ మండల పరిధిలోని నిజాంపేట్ గ్రామంలో  తెలంగాణ క్రీడా ప్రాంగాణాన్ని ప్రారంభించారు,ఎఫ్.ఎఫ్.సి.నిధులతో నిర్మించిన మురికికాలువకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువకులతో దాగివున్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్రీడా ప్రాంగణాలు ఉన్నాయోగపడతాయి అన్నారు. అదేవిధంగా ఖేడ్ నియోజకవర్గంలోనే మొట్టమొదట డబుల్ బెడ్రూమ్ లను నిజాంపేటలోనే అందజేయడం జరిగింది అన్నారు. అన్ని విధాలుగా వెనుకబడిన నిజాంపేటను ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజల సహకారంతో సర్పంచ్ జగదీశ్వర్ చారి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు అన్నారు. నిజాంపేట త్వరలో మండలంగా మారనుంది అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రాంగణం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయనుండగా నిజాంపేట్ గ్రామంలోనే మొదటగా ఏర్పాటు చేసి ప్రారంభించడం అభినందనీయం అన్నారు.ఈసందర్భంగా గ్రామసర్పంచ్ జగదీశ్వర్ చారిని శాలువాతో సన్మానించారు.అనంతరం గ్రామానికి చెందిన ఎస్.బాలమ్మకు ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరైన రూ,12000ల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్,బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ చౌహన్,ఎస్సి,ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు రవీందర్ నాయక్,మండల వైఎస్ ఎంపీపీ సాయి రెడ్డి, ఎంపీటీసీ లింగారెడ్డి ఎంపీడీఓ వెంకట్ రెడ్డి,ఉపసర్పంచ్ రాంచందర్ రావు,వార్డు సభ్యులు రజాక్,సుర్ణ నర్సింలు,బి.దుర్గమ్మ,అంజి,  గ్రామస్తులు అంజయ్య,సత్యనారాయణ,భాస్కర్ గౌడ్,కిషన్ శ్రీను,సంగమేశ్వర్ తదితరులు ఉన్నారు.