*నారాయణపేటలో జరుగు పి ఓ డబ్ల్యు 7 వ రాష్ట్రమహ సభలను విజయవంతం చేయండి*

గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 7 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల  4వ వార్డు కాలనీ లో శుక్రవారం ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర 7వ మసభల గోడపత్రికలను మహిళా సంఘం,పి ఓ డబ్ల్యు సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మహిళా సంఘం,  పిఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు ఎం.సునీత  మాట్లాడుతూ నారాయణపేట  జిల్లా కేంద్రంలో అక్టోబర్ నెల 8,9 తేదీల్లో రాష్ట్ర ఏడవ మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఎనిమిదవ తేదీన నారాయణపేట  జిల్లా కేంద్రంలో మహిళ ర్యాలీ, బహిరంగ సభ ఉంటుందని ఈ బహిరంగ సభ, సభలకు ముఖ్యవక్తులుగా సామాజిక విశ్లేషకులు దేవి, సీసీఎంబి ప్రముఖ శాస్త్రవేత్త చందన చక్రవర్తి, రాష్ట్ర అధ్యక్షులు కే.రమా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చండ్ర అరుణ,ఆహ్వాన సంఘం అధ్యక్షులు పి.నారాయణమ్మ,నాయకులు సిపిఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు ఎం.కృష్ణ, జిల్లా కార్యదర్శి బి. రాము,పి ఓ డబ్ల్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి హాజరవుతున్నారు.  సమాజంలో సగభాగమైన స్త్రీలపై వివక్షత అణిచివేత అసమానత పురుషాధిపత్యం కొనసాగుతున్నాయన్నారు. విద్యలోనూ ఉద్యోగాల్లోనూ బాధ్యతను నిర్వహణలోనూ పురుషులతో పాటు సమానంగా పోటీపడుతున్న స్త్రీని ఇంకా చిన్న చూపు చూస్తున్నారని తెలిపారు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అత్యాచారాలు హత్యలను వేధింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ మహిళలు పోరాటంలో ముందుండాలని పిలుపునిచ్చారు. స్త్రీ స్వేచ్ఛ స్వాతంత్రం విముక్తి జరగాలంటే వర్గ వైశాల్యాలు లేనటువంటి సొంత ఆస్తి లేనటువంటి సమాజాన్ని సమ సమాజం స్త్రీలకు సమాన హక్కులు  సమాజం కోసం పోరాడాలని దీనికై మహిళలు చైతన్య వంతంగా ఐక్యంగా వర్గ పోరాటాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  మహిళా సంఘం నాయకురాలు శ్రావణి,అనిత ,వైష్ణవి ,సఫియాబేగం,జీవ మణి,
సింధుజ తదితరులు పాల్గొన్నారు.