నారాయణ స్కూల్ కు సెలవులు లేవా!
నారాయణ స్కూల్ కు సెలవులు లేవా!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనను తుంగలో తొక్కి నారాయణ స్కూల్ విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించకుండా విద్యార్థులను పట్టి పీడిస్తున్న నారాయణ యాజమాన్యం…పై చర్యలు తీసుకోవాలని నారాయణ పాఠశాలకు కొమ్ముకాస్తున్నవిద్యాశాఖ అధికారులపై జిల్లా పాలనాధికారి చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని,
ఐక్య విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ చేశారు.
మంచిర్యాల పట్టణ కేంద్రం రాంనగర్ లో గల నారాయణ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవులకు విరుద్ధంగా పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల దగ్గరికి వెళ్లి ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థిని విద్యార్థులను స్కూల్ నుంచి పంపించడం జరిగింది…ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నారాయణ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవులకు విరుద్ధంగా పాఠశాల నడిపిస్తున్నారని సంబంధిత అధికారులకు తెలియజేసినప్పటికీ స్పందించకపోవడం సిగ్గుచేటు విద్యార్థులకు సెలవుల పట్ల అవగాహన కల్పించి వారిని ఇంటికి పంపించడం జరిగిందని అన్నారు ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు తక్షణమే జిల్లా పాలనాధికారి గారు స్పందించి నారాయణ పాఠశాలకు కొమ్ముకాస్తున్న ఎంఈఓ డిఈఓ పై చర్యలు తీసుకొని ఇలాంటివి పునరావృత్తం కాకుండా నారాయణ పాఠశాల ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో…తెలంగాణ విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్, తెలంగాణ విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షుడు రేగుంట క్రాంతికుమార్, బిసివిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సల్మాన్, తెలంగాణ బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్, జాతీయ విద్యార్థి సమైక్య తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరాల వంశీ, ఎన్ఎస్ సి జిల్లా అధ్యక్షుడు పురేళ్ల నితీష్ తదితరులు పాల్గొన్నారు.