నాలుగు పరుగులకే విరాట్ కోహ్లీ అవుట్

బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ భాగంగా ఇక్కడ జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా 64 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. వైఎస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(4) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు అజ్యింకా రహానే(33), శిఖర్ ధావన్ (1) లు అవుటయిన సంగతి తెలిసిందే.  ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ కు రెండు వికెట్లు దక్కగా, అండర్ సన్ కు ఒక వికెట్ లభించింది.