నాలుగు వారాల్లో.. రూ.20లక్షలు చెల్లించండి
– లేకుంటే విూ మ్యాచ్‌ల ఫీజులో కోత విధిస్తాం
– రాహుల్, పాండ్యాకు బీసీసీఐ పనిష్మెంట్!
ముంబయి, ఏప్రిల్20(జనంసాక్షి) : టీమిండియా క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలకు బీసీసీఐ అంబుడ్స్‌మన్ ఆసక్తికర శిక్ష వేసింది. ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో ఇరువురు క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వీరిపై సీరియస్ అయ్యి.. పలు మ్యాచ్‌లకు వారిపై నిషేదం విధించింది. కాగా పలువిధాల అర్జీల నిమిత్తం బీసీసీఐ వీరికి జరిమానా విధించింది. విధుల్లో అమరులైన పదిమంది పారామిలటరీ కానిస్టేబుళ్ల కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఇవ్వాలని ఆదేశించింది. అంతేగాక అంధుల క్రికెట్ సంఘానికి పది లక్షల రూపాయలు నిధులు సవిూకరించాలని తెలిపింది. ఈ రెండింటికీ నాలుగు వారాల గడువు విధించిన అంబుడ్స్‌మెన్… ఒక వేళ గడువులోగా నిధుల సవిూకరణ పూర్తికాకపోతే మ్యాచ్ ఫీజులో నుంచి మినహాయింపు ఉంటుందని హెచ్చరించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్.. బీసీసీఐ అంబుడ్స్‌మెన్‌గా వ్యవహరిస్తున్నారు. క్రికెటర్ల అంశంపై శనివారం తుది తీర్పు ఇచ్చిన అంబుడ్స్‌మెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువతకు ఆదర్శంగా నిలవాల్సిన క్రికెటర్లు ¬దాకు తగ్గట్టుగా వ్యవహరించాలన్నారు. ఆస్టేల్రియా టూర్ నుంచి వెనక్కి రప్పించడం వల్ల 30 లక్షల రూపాయలను ఇద్దరూ కోల్పోయారని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరూ క్షమాపణ చెప్పారు కాబట్టి.. బీసీసీఐ రూల్స్ 41/1/ఞ ప్రకారం ఆటగాడు క్రమశిక్షణారాహిత్యం/ నిబంధనలు ఉల్లంఘించడం/ తప్పుగా వ్యవహరించడంగా వారి చర్యలను పరిగణించి ఈ శిక్షలు విధించామన్నారు.