నిందితుని అరెస్టు, రిమాండుకు తరలింపు
కుత్బుల్లాపూర్: తాళం వేసిన ఇంటిలోకి ప్రవేశించి రూ. 2.07 లక్షల విలువ చేసే బంగారు నగలు తస్కరించుకుపోయిన నిందితుని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. సంజయ్ గాంధీ నగర్‌కు చెందిన రమణయ్య , సరస్వతి దంపతులు ఇటీవల ఇంటికి తాళం వేసి స్వగ్రామానికి వెళ్లారు. ఈ నెల 21న తిరిగి వచ్చి చూసేసరికి తాళాలు బద్దలు కొట్టి ఉన్నాయి. బీరువాలో దాచి ఉంచిన 9తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బాధితుల ఇంటికి తరచూ వచ్చి వెళ్లే కళావతినగర్‌కు చెందిన మధు (26)ను అనుమానంపై పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మధుతాను చోరీ చేసినట్లుగా ఒప్పుకుని చింతల్‌లోని ఫెనాస్స్ కంపెనీలో ఆభరణాలను విక్రయించినట్లు చెప్పాడు. పోలీసులు ఫెనాస్స్ కంపెనీ నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకుని మధును