నిందితుల్ని త్వరగా.

.

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 28 (జనంసాక్షి): ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ బాధితురాలికి సరైన వైద్య సహాయం అందిస్తామని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని న్యాయస్థానాలను కోరారు. ఐఏసీస 127వ వార్షికోత్సవాన్ని నిర్వహించకూడదని ఆమె పార్టీ శ్రేణులకు సూచించారు. తన మనసంతా బాధిరాలి దగ్గరే ఉందని అన్నారు. దోషులను కఠినంగా

వైద్యులు చెప్పారు. హృదయ సంబంధమైన సమస్యతో ఆమె తీవ్రంగా బాధపడుతోందని చెప్పారు. అంతేకాకుండా ఊపిరితిత్తులకు, పొట్టకు ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు చెప్పారు. దానికి తోడు, మెదడులో గాయాలైనట్లు తెలిపారు. బాధితురాలి ఆరోగ్యంలో నిలకడ కోసం వైద్యులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అత్యంత మెరుగైన వైద్యం అందించడానికి వీలుగు భారత హై కమిషన్‌ ఆసుపత్రికి, బాధితురాలి కుటుంబ సభ్యులకు సహాయం అందిస్తోంది. శారీరక పరిస్థితి సర్జరీ చేయడానికి తగిన విధంగా లేదని అంటున్నారు. భారతదేశంలోనే ఆమెకు చాలా సర్జరీలు జరిగాయి.

127వ పార్టీ వార్షిక ఉత్సవాలు నిర్వహించకూడదని కాంగ్రెస్‌ అధ్యక్షులు సోనియా గాంధీ ఆదేశలు జారీ చేశారు. తన మనసంతా బాధితురాలిపైనే ఉందని ఆమె అన్నారు. దోషులకు సాధ్యమైనంత త్వరగా శిక్ష పడాలని తాను కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. దోషులను వదిలిపెట్టేది లేదని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సింగ్‌ అన్నారు. ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ తీరుపై ప్రధానితో పాటు సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ 127వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెప్పడానికి సోనియా గాంధీ ఇష్టపడలేదు. బాధితురాలికి చికిత్స జరిగి, ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నామని సోనియా అన్నారు.