నిఘా నేత్రంలో పాకిస్థాన్ జట్టు
ఆటగాళ్ళ కూడా ప్రత్యేక అధికారులు
లండన్ ,మే 14 (జనంసాక్షి):
ఇంగ్లాండ్‌లో తమ జట్టు పర్యటన పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో గుబులు రేపుతోంది. సరిగ్గా మూడేళ్ళ క్రితం ఇంగ్లీష్ టూర్‌కు వెళ్ళినప్పుడు పాక్ క్రికెటర్లు సల్మాన్‌భట్ , మహ్మద్ అసిఫ్ , మహ్మద్ అవిూర్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. ప్రపంచ క్రికెట్‌లో సంచలనం సృష్టించిన ఈ స్పాట్ ఫిక్సింగ్ ఎపిసోడ్‌కు సంబంధించి ముగ్గురు పాక్ క్రికెటర్లు జైలుశిక్ష కూడా అనుభవించడంతో పాటు నిషేధానికి గురయ్యారు. దీంతో ఇకపై అటువంటి వివాదాలు తలెత్తకుండా , ఆటగాళ్ళు ఎటువంటి సమస్యల్లో చిక్కుకోకుండా ఉండేందుకు పాక్ క్రికెట్ బోర్డు ప్రణాళికలు సిధ్ధం చేసుకుంది. వచ్చే జూన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ జట్టు ఇంగ్లాండ్‌కు వెళ్ళనుంది. జట్టు కూడా ఇద్దరు ప్రత్యేక అధికారులను పిసిబీ నియమించింది. వీరిలో ఒకరు సెక్యూ రిటీ అధికారి కాగా , మరొకరు విజిలెన్స్ అధికారి. వీరిద్దరూ ఆటగా ళ్ళ వెన్నంటే ఉంటూ వారి కదలికలను గమనిస్తూ ఉంటారు. అను మతి లేకుండా ప్లేయర్స్ ఎవరూ బహిరంగా ప్రదేశాలకు వెళ్ళకుండా కఠినమైన ఆంక్షలు కూడా బోర్డు విధించింది. తాము ఏర్పాటు చేసిన అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తుంటారని పిసిబీ తెలిపింది. ఆటగాళ్ళు ఎటువంటి వివాదాల్లో చిక్కుకోకుండా ఉండేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. విూడియా నుండి కూడా పాక్ ఆటగాళ్ళను దూరంగా ఉంచాలని నిర్ణయించింది. 2010 స్పాట్ ఫిక్సింగ్ ఎపిసోడ్‌కు కారణం ఒక పత్రిక చేసిన స్టింగ్ ఆపరేషనే. దీంతో ఆటగాళ్ళు తమకు తెలియకుండా ఎటువంటి ఇంటర్యూలు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్ స్కాట్లాండ్ , ఐర్లాండ్ జట్లతో రెండు వన్డేలు కూడా ఆడనుంది. కాగా ఈ పర్యటన చాలా సున్నితమైనదని టీమ్ మేనేజర్ నవీద్ అక్రమ్ చెప్పారు. బోర్డు విధించిన కఠిన నిబంధనల గురించి ఆటగాళ్ళకు వివరించినట్టు కూడా తెలిపారు.