నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులే బిజెపి ముమ్మాటికి దేశద్రోహులే
విమోచన కాదు, విలీనమే
——CPM జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి
కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 17(జనం సాక్షి)
సిపిఎం జిల్లా కార్యాలయంలో శని వారం వీర తెలంగాణ సాయుధ పోరాట అమరులకు ఘనమైన నివాళులర్పించి,వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య,చిట్యాల ఐలమ్మ,చిత్రపటాలకు పూలమాలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ… కమ్యూనిస్టు నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలను పేదలను ఐక్యం చేసి నైజాం,నవాబ్ రజాకార్లను తరిమివేశారని అన్నారు.బాంచన్ దొర,నీ కాల్మొక్త అనే బడుగు వర్గాలను బందూకులు చేత పట్టించి నైజాం నవాబు రజా కారులను తన్ని,తరిమిన చరిత్ర కమ్యూనిస్టులది అన్నారు.
సాయుధ పోరాటంలో గాని,స్వాతంత్ర ఉద్యమంలో గాని పాల్గొనని బిజెపి విమోచన పేరు చెబుతూ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చరిత్రను వక్రీకరిస్తుందని *ఈ దేశానికి బిజెపి ముమ్మాటికీ ద్రోహులేనని అన్నారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భక్త పలుచని బడుగు వర్గాలను ఐక్యం చేసి దున్నేవాడికే భూమి కావాలని కమ్యూనిస్టుల నాయకత్వంలో పది లక్షల ఎకరాల భూమిని పంపిని చేసిన ఘనత కమ్యూనిస్టు లేదని అన్నారు.
ఈ దేశానికి కమ్యూనిస్టులే నిజమైన దేశభక్తులని అన్నారు.
నైజాం నవాబు ముస్లిం కావచ్చు,కర్కోటకుడే కావచ్చు కానీ అదే ముస్లిం కు వ్యతిరేకంగా ముగ్డం మోహినుద్దీన్,బందగి, షోయబుల్లాఖాన్
వంటి అనేకమంది ముస్లింలు సాయిధ పోరాటంలో పాల్గొన్నారని, అలాగే హిందువులుగా ఉన్న జన్నపరెడ్డి ప్రతాపరెడ్డి, ప్రజా కార్ల సైన్యం ఉపాధ్యక్షుడు విసునూర్ దేశముఖ్, రాపాక రామచంద్రారెడ్డి,పాలు ఇచ్చే తల్లులను మోదుగు దోప్పల్లో పాలు పిండి చూపించు మన్న పసునూరి రామ్మోహన్ రావు హిందువేనని, అందుకని చిత్రహింసలు పెట్టిన వారిలో హిందువులు ముస్లింలు ఉన్నారనితెలిపారు.చిత్రహింసలకు గురైన దోపిడీకి గురైన వారిలో హిందూ ముస్లింలు ఉన్నారని తెలంగాణ సాయుధ పోరాటానికి మతం రంగు పూల్చి రాజకీయ పోవడానికి బిజెపి కుట్రలు చేస్తుందని అన్నారు.
తెలంగాణ సాయుధ రహితంగా తొలి అమరుడు దొడ్డి కొమురయ్య,చిట్యాల ఐలమ్మ,పుచ్చలపల్లి సుందరయ్యల స్ఫూర్తితో మతోన్మాద బిజెపిపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం,జి.బీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు ఇ.రమేష్,D.నరేష్ పటేల్,S.రజనీకాంత్,M. పూజ,నాయకులు జి.తిరుపతి,పున్నం రవి,మాతంగిశంకర్,అరవింద్,రోహిత్ తదితరులు పాల్గొన్నారు.