నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం

3

– ఎంపీ కవిత

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 1(జనంసాక్షి): నిజాం షుగర్‌  ఫ్యాక్టరీ పునరుద్దరణకు కట్టుబడి ఉన్నామని ఎంపీ కల్వకుంట్ల కవిత హావిూ ఇచ్చారు. ఫ్యాక్టరీ పునరుద్దరణకు కట్టుబడి ఉన్నామని ఆ మేరకు కార్యాచరణ చేస్తున్నామని అన్నారు. ఈ ఫ్యాక్టరీ పునరుద్దరించడం ద్వారా అటు రైతులను ఇటు కార్మికులను ఆదుకోవాలన్నదే సర్కార్‌ లక్ష్యమన్నారు. నిజాంషుగర్‌ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నామని అన్నారు. రైతులు కొ ఆపరేటివ్‌ పద్దతిలో ముందుకొస్తే నడిపేందుకు  ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ఈ రకంగా అయినా తప్పకుండా ఫ్యాక్టరీకి పూర్వవైభవం వస్తుందని స్పష్టం చేశారు.  నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని భ్రష్టు పట్టించిందే చంద్రబాబు నాయుడని ధ్వజమెత్తారు. గత పాలకుల నిర్లక్ష్యం వలన చెరుకు రైతులకు కష్టాలు వచ్చిపడ్డాయని అన్నారు. చెరుకు ఉత్పత్తి ఉన్నా నష్టాల్లో చూపారని విమర్శించారు. చెరుకు రైతులకు టీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 2014 నుంచి రూ66 కోట్లు బకాయిలు చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. గత మార్చిలో చెరుకు రైతు సమస్యలపై బస్సు యాత్ర చేశామన్నారు. ప్రతిపక్షాలు రైతులను, ఉద్యోగులను మభ్యపెట్టాడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. వారికి సమస్యను పరిష్కరించడం కన్నా దానివల్ల రాకీయ లబ్ది పొందాలన్నదే దురాలోచన అన్నారు. ప్రాజెక్టులపై ఇంకా రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలావుంటే జిల్లాలో సాగునీటి రంగం అభిశృద్దితో పాటు రైతుల సమస్యలపై చిత్తశుద్దితో కృషి చేస్తున్‌ఆనమని అన్నారు. మరోవైపు ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో కందకుర్తి ఎత్తిపోతల ఆయకట్టుకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంపీ కృషిపై పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతలను ఇరిగేషన్‌ ఎస్‌ఈ సి.గంగాధర్‌ పరిశీలించారు. గోదావరినది ఒడ్డున నిర్మించిన ఎత్తిపోతల పథకం కింద కందకుర్తి, నీలా, బోర్గాంలో 3,366 ఎకరా ల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. గోదావరినదిలో నీరు ఉన్నా పంటలకు సాగు నీరందకుండా పోతోందని రైతులు  ఎంపీని కలిసి విన్నవించారు. దీంతో సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎంపీ ఆదేశాలు జారీ చేశారు.ఇరిగేషన్‌ ఎస్‌ఈతోపాటు ఈఈ సత్యశీలరెడ్డి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ను పరిశీలించారు. జూన్‌లో చోరీకి గు రైన 750 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్‌, పంప్‌హౌస్‌కు ఆనుకొని ఉన్న ర్యాంప్‌ కుంగి పోయిన వాటి స్థానంలో నూతనం గా ర్యాంప్‌ నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఏఈని ఆదేశించారు. పంప్‌హౌస్‌ నుంచి గ్రామ శివారు వరకు నడిచేందుకు వీలుగా మొరం రోడ్డును వేయించాలని సూచించారు. ఎత్తిపోతల పథకం ఆధునీకరణకు మంజూరైన రూ. 14కోట్లతో ప్రతిపాదనాలు తయారు చేసిన పనులకు నిధులు ఉపయోగిస్తామని ఎస్‌ఈ తెలిపారు.