నిజామాబాద్‌ జిల్లాలో మహిళ దారుణహత్య

బీర్కూరు : నిజామాబాద్‌ జిల్లా బీర్కూరు మండలంలోని దుర్కి  గ్రామంలో హనుమాన్‌ కాలనీ శివారులో ఓ మహిళను అత్యాచారం చేసి హ:త్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఒక లచ్చవ్వ (45)  అనే మహిళను గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఆమెను బలవంతంగా పంట పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి చంపేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.