నిజామాబాద్ సభలో ప్రధాని మోడీ అబద్దాలు మాట్లాడారు
ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివారు
నిజామాబాద్ తిరిగితే ఏం జరిగిందో తెలుస్తుందన్న కవిత
నిజామాబాద్,నవంబర్27(జనంసాక్షి): నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి అబద్దాలు మాట్లాడారని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత విమర్శించారు. ఇచ్చిన హావిూలను విస్మరించడమే గాకుండా టిఆర్‌ఎస్‌పై బురదజల్లే ప్రయత్నాలు చేయడానికే వచ్చినట్లుగా ఉందన్నారు. ఎవరో రాసిచ్చిన స్కిప్ట్‌న్రు చదివారని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత విమర్శించారు. ప్రధాని స్థాయి వ్యక్తి అలా మాట్లాడటం బాధాకరమన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచార సభలో భాగంగా మోదీ.. సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్ పాలనను విమర్శించిన నేపథ్యంలో కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె విూడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రచార సభలో పసుపు బోర్టు ఏర్పాటును ప్రకటిస్తారని తనతో సహా రైతులందరూ ఆశగా ఎదురుచూశామని కానీ దాని ప్రస్తావనే తీసుకరాలేదని ఎద్దేవ చేశారు. అర్మూర్, బాల్కొండ ప్రాంతాల్లో మోదీకి పసుపు పంటలు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ ఫిక్స్ అయిందని మోదీ ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలతోనే తాము ఫిక్సయ్యామని, అభివృద్దిలో తెలంగాణ ప్రజలతోనే తమకు మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని చురకలు అంటించారు. నిజమాబాద్ జిల్లాలో మౌలిక వసతుల అన్నీ ఉన్నాయి. మోదీకి, బీజేపీకి సవాలు విసురుతున్నా.. నిజమాబాద్ జిల్లా మొత్తం తిరుగుదాం.. యెండల లక్ష్మీనారాయణ పేరు విూద అభివృద్ధి జరిగిందా లేక టీఆర్‌ఎస్ పేరిట జరిగిందో చూద్దాం?. ఉమ్మడి జిల్లాలో 28 వేల మందికి రెండు కోట్ల ఎనభై లక్షల ఆసరా పెన్షన్‌లు ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా పక్కా ప్రణాళికతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసి, ఆ తర్వాత రోడ్లు పునర్నిర్మాణం చేశాం. మోదీ వారణాసి మున్సిపాలిటీకి కూడా ఇస్తారో లేదో తెలియదు కానీ నిజామాబాద్‌కు ప్రతీ సంవత్సరం వంద కోట్లు కేటాయిస్తున్నాం. 145 కోట్లతో మంచినీటి పథకం, ఐటీ హబ్ ఏర్పాటు, కొత్త రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం, మెడికల్ కాలేజీకి 97 కోట్లు కేటాయించాం, ఇవన్నీ ప్రధాని గమనించాలి. ఏటా సందర్శించి పర్మిషన్ ఇస్తారు కదా బాలేకపోతే పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు అంటూ ఎంపీ కవిత ప్రధాని ప్రసంగంపై విమర్శలు గుప్పించారు. విూడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బీగాల గణెళిశ్ తదితరులు పాల్గొన్నారు.