నిత్యావసర సబ్సిడీ సరుకుల సంఖ్యను పెంచాలి

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బాలస్వామి
పానుగల్ అక్టోబర్17, జనంసాక్షి
 నిత్యావసర సబ్సిడీ సరుకుల సంఖ్యను పెంచాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బాలస్వామి డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో బీజేపీ అసమర్థ పాలనపై నిరసన తెలిపి,పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ యేసయ్యకు ఇచ్చినట్లు తెలిపారు.కేంద్రం ప్రభుత్వం మనిషికి ఐదు కిలోల ఉచిత బియ్యంతో సరిపెడుతోందని,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రేషన్ షాపుల్లో 9 రకాల నిత్యవసర సరుకులను సబ్సిడీపై ఇచ్చేవారన్నారు రాష్ట్రంలో ఇప్పుడు మనిషికి ఆరు కిలోల బియ్యం మాత్రమే ఇస్తోందన్నారు.పరిమితిని ఐదు నుంచి పది కిలోలకు పెంచాలన్నారు.పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య,మండల కమిటీ సభ్యులు చిన్న కుర్మయ్య,మాల కుర్మయ్య,కాకం కాశన్న, ఏ ఐ వై ఎఫ్ నాయకులు కాకం చిన్న రాముడు,పెద్ద రాముడు కాకం నరసింహ, చిట్టెమ్మ, బుజ్జన్న తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు