నిన్నొదల బొమ్మాళీ
అమీర్‌పేట భూముల కేసులో తమిళనాడు గవర్నర్ రోశయ్యకు
ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు
హైదరాబాద్, జూన్ 18 (జనంసాక్షి): రాష్ట్ర రాజధాని లో వివాదాస్పద అమీర్‌పేట భూ వివాదం కేసులొ విచారణ నిమిత్తం హాజరు కావాలంటూ తమిళనాడు గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య ఎసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం సోమవారం సమన్లు పంపింది. అమీర్‌పేటలో రూ.500 కోట్లు విలువ చేసే 9 ఎకరాల 14 కుంట్ల భూమిని అధికారులు చట్ట విరుద్ధంగా జిఎ.నాయుడు, మరి కొందరు వ్యక్తులకు కట్టబెట్టారని ఆరోపిస్తూ మోహన్‌లాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ద్వారా ఈయన తరపు న్యాయవాది టి.శ్రీ.రంగారావు చేసిన ఫిర్యాదు మేరకు గవర్నర్ రోశయ్యకు ఏసీబీ న్యాయస్థానం సమన్లు పంపింది.రోశయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వివాదాస్పద భూమికి డీ-నోటిఫికేషన్ ఉత్తర్వుజారీ అయ్యింది. ఐపీసీ లోని 409వ సెక్షన్, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం నిందితునిగా ఉన్న రోశయ్యను విచారణకు రావలసిందిగా ఏసీబీ న్యాయస్థానం మేజిస్ట్రేట్ ఎస్ జగన్నాథ్ సమన్లు జారీ చేశారని రంగారావు ‘ఎక్స్‌ప్రెస్’ కు చెప్పారు.రోశయ్య రాష్ట్రముఖ్యమంత్రిగా ,మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపాల్ కార్యదర్శిగా ట.ీఎస్.అప్పారావు, హెచ్ ఎండి ఎలోమెట్రోపాలిటన్ కమిషనర్‌గా బి.ప.ిఆచార్య ఉన్నప్పుడు ఇందుకు సంబంధించిన జీవో నెం.288జారీ అయ్యింది. వాస్తవానికి పైన పేర్కోన్న భూమి హెచ్‌ఎండిఎ స్వాధీనంలో ఉండేది. ఈ ఐఎఎస్ అధికారులు ఇరువురూ,అప్పట్లో ముఖ్యమంత్రి ప్రిన్సిపాల్ కార్యదర్శిగా ఉన్న సివిఎస్‌కె శర్మ ఈ కేసుకు సంబంధించి గతం లోనే న్యాయస్థానానికి వచ్చారు. ప్రాధమిక విచారణ అనంతరం రోశయ్య వ్యతిరేకంగా సాక్ష్యమేదీ లేదంటూ మార్చి 2011లోనే ఏసీబీ అధికారులు న్యాయస్థానానికి ఒక నివేదిక సమర్పించారు. కాగా ఈ నివేదికను తిరస్కరించిన ఏసీబీ న్యాయస్థానం,పిటిషనర్ సమర్పించిన పిటీషన్ మేరకు సాక్షులందరినీ ప్రశ్నించాలని నిర్ణయించింది.