నిబంధనల మేరకు మరుగదొడ్ల నిర్మాణాలు పూర్తి
నిజామాబాద్,జనవరి5(జనంసాక్షి): నాణ్యత లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే మరుగుదొడ్లకు
వాటికి బిల్లుల చెల్లింపు ఉండదని అధికారులు హెచ్చరించారు. జిల్లాలో అన్నిగ్రామాల్లో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని జిల్లా పరిషత్తు సీఈవో అన్నారు. అన్ని గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏయే గ్రామంలో ఏ స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణాలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఇసుక కొరతతో నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందని సీఈవో దృష్టికి తీసుకురావడంతో ఐహెచ్‌హెచ్‌ఎల్ నిర్మాణాలకు అనుమతి ద్వారా తరలిస్తున్న ఇసుక పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత కార్యదర్శులదేనన్నారు. నిర్దేశిత సమయంలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారన్నారు. 80 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయిన గ్రామాలను గుర్తించి మిగిలిన 20 శాతం పనులను వెంటనే పూర్తి చేస్తామన్నారు. గ్రామాల్లో నిర్మాణాలు వెనుకబడి ఉండటంపై కార్యదర్శులను మందలించారు.