నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ స్కూల్స్..

పుస్తకాలు, స్టేషనరీ పీర్లతో లక్షల్లో వసూళ్ళు.

శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో స్టేషనరీ దందా..ప్ర‌భుత్వ నిబంధ‌నలకు తూట్లు.

చోద్యం చూస్తూన్న విద్యా శాఖ అధికారులు.

 

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,జూలై08(జనంసాక్ష) ప్ర‌భుత్వ జీవో నెం.46ను ప‌ట్టించుకోకుండా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజుల‌ను వ‌సూలు చేస్తూన్నారు.పూర్తి వివరాల్లోకి వెళితే… ఇబ్రహీంపట్నం పట్టణ కేంద్రంలోని శ్రీ చైత్యన టెక్నో స్కూల్ తన పరిధి దాటి నిబంధనలకు విరుద్ధంగా తరగతుల పెంపు చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు.ఈ పాఠశాలలో 7వ తరగతి వరకే ఉన్నా గానీ 8,9,10 వ తరగతుల వరకు ఆఫగ్రేడ్ ఉన్నట్లు విద్యార్థుల నుంచి అడ్మిషన్లు తీసుకోని తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని తల్లిదండ్రులు, విద్యార్థులు చెబుతున్నారు.ఇదిలా ఉంటె పుస్తకాలు, స్టేషనరీ పేర్లమీద లక్షల్లో ముక్కుపిండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు.ఇవన్నీ తెలిసిన తెలియనట్లు స్థానిక ఎంఈఓ చూడనట్లుగా వ్యవహరిస్తూన్నారని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు.నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఇలాంటి స్కూల్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.మరి సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి…!

ఎంఇఓ వివరణ

ఇదిలా ఉంటే శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో అధిక ఫీజులు,స్టేషనరీ,పుస్తకాలు అమ్మకాలు, పై తరగతులకు సంబంధించి ఎంఇఓ వెంకట్ రెడ్డి ని వివరణ కోరగా..శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఉన్న తరగతులు కాకుండా 10 వరకు చేస్తుండటం మా దృష్టికి వచ్చిందని అన్నారు.అయితే ఇదే విషయాన్ని స్కూల్ యాజమాన్యానికి అనుమతులు లేకుండా పై తరగతులకు ఆఫగ్రేడ్ చేసుకోవడం చట్ట విరుద్ధం అని చెప్పడం జరిగిందని తెలిపారు.అలాగే అధిక ఫీజులు వసూళ్లు,పుస్తకాలు అమ్మడం లాంటి వాటిపై ఇప్పటివరకు తల్లిదండ్రులు, పిల్లల నుండి ఫిర్యాదులు రాలేవని అన్నారు.ఒకవేళ అధిక ఫీజులు వసూళ్లు, పుస్తకాల అమ్మకం పై ఫిర్యాదులు వస్తే కచ్చితంగా పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు…