నియంతలా పాలన సరికాదు : సిపిఐ

ఆదిలాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): సిఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ దుయ్యబట్టారు. రాష్ట్రంలో మాఫియా పాలన కొనసాగుతోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హావిూలు అమలు చేయకపోగా విమర్శలు చేఇన వారిని కేసులతో భయపెడు తున్నారని అన్నారు. కోదండరామ్‌ లాంటి వారిని అణచివేయాలని చూడడం సరికాదన్నారు. ప్రభుత్వం మెడలు వంచి వాటిని నేరవేర్చేందుకే సిపిఐ పోరుయాత్ర అని తెలిపారు. విపక్షాల సూచనలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. సమైక్య పోరాటాలతో పాలకుల మెడలు వంచి రైతులను కాపాడతామని అన్నారు. వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రైరైతాంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. రుణమాఫీ చేయకుండా రైతాంగాన్ని మోసగించారని ఆరోపించారు. నకిలీ విత్తనాల పత్తిక్వింటాకు రూ. 6వేలు చెల్లించాలని, నకిలీ విత్తనాలు నిరోధించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేసారు.