నిరుద్యోగులకు కెసిఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి
పి వై ఎల్ నాయకులు నోముల భానుచందర్ డిమాండ్
టేకులపల్లి, అక్టోబర్ 18( జనం సాక్షి): ఎన్నికల ముందు కెసిఆర్ తెలంగాణ ప్రజలకు, నిరుద్యోగులకు, ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రగతిశీల యువజన సంఘం PYL కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి నోముల భానుచందర్ డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో కెసిఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చారని, ఆ హామీలను ఇప్పటి వరకు అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూం, నిరుద్యోగ భృతి, దళితులకు మూడు ఎకరాల భూమి ఇలా అనేక హామీలు ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పటి వరకు ఆ హామీలు అమలు చేయలేదుఅని అన్నారు. పొడు భూములకు పట్టాలు ఇస్తామని ఎన్నికల ముందు కెసిఆర్ హామీ కూడా ఇప్పటి వరకు జరగలేదని, ఇప్పుడు సర్వే పేరుతో కాలయాపన చేస్తున్నారని, ఇప్పటికైనా సర్వే చేసి పొడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, ఎన్నికల ముందు కెసిఆర్ ఇచ్చిన హామీలను వేంటనే అమలు చేయాలని పి వై ఎల్ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పివైల్ మండల అధ్యక్షులు భూక్య. లక్ష్మణ్, కార్యదర్శి తొటకూరి. సతీష్,క్రాంతి జార్జి, రామ, కిరణ్, గవాస్కర్ తదితరులు పాల్గొన్నారు.