నిరుపేదలకు ఆసరాగా ప్రభుత్వ పింఛన్లు :సర్పంచ్ చిత్తారి గౌడ్
దౌల్తాబాద్ సెప్టెంబర్ 23, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల పరిధిలో ఉప్పరపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఆసరాగా ప్రభుత్వ పింఛన్లు నిలుస్తున్నాయని ఉప్పరపల్లి సర్పంచ్ చిత్తారి గౌడ్ అన్నారు. ప్రభుత్వం ఆసరా పెన్షన్ కార్డులను గ్రామస్తులకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఈ ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు ఎంతో మేలు చేస్తూ ఆసరగా ఉన్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్, టిఆర్ఎస్ నాయకులు,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.