నిర్ణయాల్లో మీరు కీలకం

4

– పదవీవిరమణ చేసిన రాజ్యసభ సభ్యులకు ప్రధాని అభినందనలు

న్యూఢిల్లీ,మే13(జనంసాక్షి): రాజ్యసభలో రిటైర్‌ అవుతున్న సభ్యులకు ప్రధాని మోడీ  శుభాకాంక్షలు తెలిపారు. వారి సేవలు ఇకముందు కూడా అవసరమన్నారు. పదవీ కాలం ముగిసి వెళ్తోన్న ఎంపీలను ఉద్దేశించి ఇవాళ ప్రధాని మోదీ రాజ్యసభలో మాట్లాడారు. రిటైర్‌ అవుతున్న ఎంపీలు పదవీ కాలంలో ఉన్నప్పుడు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన అన్నారు. ఆరేళ్ల తర్వాత పదవీ విమరణ చేస్తోన్న ఎంపీలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సభా వ్యవహారాలకు ఎంపీలు దూరమైనా.. సమాజ సేవలోనే ఉంటారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జీఎస్టీ బిల్లు విూ హయంలోనే ఆమోదం పొంది ఉంటే ఎంతో ఉపయోగం జరిగి ఉండేదని, మళ్లీ సభకు తిరిగి వచ్చే ఎంపీల వల్ల ఆ అవకాశం తీరాలన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గతప్రభుత్వ హయాంలోనూ, ఈ ప్రభుత్వ హయాంలోనూ వీరు ఉన్నందుకు ఆనందంగా ఉందన్నారు. రాజ్యసభ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పదవీకాలం ముగిసిన 53 మంది సభ్యులకు వీడ్కోలు పలుకనున్నారు. సభలో ఇతర అంశాలపై చర్చించేది లేదని రాజ్యసభ చైర్మన్‌ ప్రకటించారు. అలాగే ఏపీ ప్రత్యేక ¬దాపై ఎంపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు సైతం ఎజెండాలో చేర్చలేదు. పదవీ విమరణ చేస్తున్న ఎంపీలు కూడా సభలో మాట్లాడారు. సభ్యుల వీడ్కోలు అనంతరం రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడనుంది. మరోవైపు పదవీకాలం పూర్తి అయిన సభ్యులు వీడ్కోలు తెలుపుతుండటంతో రాజ్యసభలో కాంగ్రెస్‌ బలం తగ్గనుంది. పదవీకాలం ముగిసిన సభ్యుల్లో 16 మంది కాంగ్రెస్‌ ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ప్రస్తుతం 65 మంది కాంగ్రెస్‌ సభ్యులు ఉండగా ఆ సంఖ్య 49కి పడిపోనుంది. పదవీవిరమణచేస్తున్న వారికి ఆర్తికమంత్రి జైట్లీ, ఛైర్మన్‌ అన్సారీ కూడా శుభాకాంక్షలు తెలిపారు.