నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి
జడ్పీ సీఈవో ప్రేంకరణ్ రెడ్డి
మిర్యాలగూడ. జనం సాక్షి , నిర్దేశించిన లక్ష్యాలను గ్రామపంచాయతీ కార్యదర్శులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బంది వేగవంతంగా పూర్తి చేయాలని నల్లగొండ జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రేంకరణ్ రెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ హాలులో జరిగిన కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ హరితహారం కింద జిల్లాలో 1.7కోట్ల మొక్కలు నాటడం లక్ష్యమని అన్ని మండలాల్లో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తే సాధించగలమన్నారు. హరిత భారం కింద మొక్కలు నాటేందుకు ఉపాధి సిబ్బంది గుంతలు సకాలంలో తీసి పంచాయతీ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఉపాధి కూలీలను పెంచాలని, బడ్జెట్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మన ఊరు-మన బడి కింద పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రహరి గోడలు, మరుగుదొడ్లు నిర్మించాలని, పారిశుధ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని, స్వచ్ఛమైన తాగునీరందించాలని కోరారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో పారిశుధ్యం పూర్తి స్థాయిలో నిర్వహించాలని కోరారు. తొలుత మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సిఇఒ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పిటిసి మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి ఎంపిపి నూకలు సరళహన్మంతరెడ్డి, ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, పంచాయతీ రాజ్ ఏ ఈ ఆదినారాయణ మండల రైతు సమైక్య అధ్యక్షులు ఏడుకొండలు ఎంపిఓ వీరారెడ్డి, ఉపాధి హామీ పథకం ఎపిఓ శిరీష, సూపరింటెండెంట్ కరుణాకర్ సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area