నిర్దేశిత సమయానికే మిషన్ భగీరథ నీళ్లు
నాగర్‌కర్నూలు,జూలై27(జనం సాక్షి): ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15న కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్నిగ్రామాలకు ప్రతి ఇంటికి నల్లా ద్వారా మిషన్ భగీరథ నీళ్లను ప్రజలకు అందించాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ మంచి మనసుతో ప్రారంభించిన మిషన్ భగీరథ పనులులను.. కల్వకుర్తి నియోజకవర్గంలో 95 శాతం పూర్తయ్యావని, 5 శాతం పనులను మరో 15 రోజుల్లో పూర్తి చేసి నియోజకవర్గంలోని 90 శాతం గ్రామాలకు ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి భగీరథ నీళ్లుఅందిచాలని ఎమ్మెల్సీ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మిషన్ భగీరథ పనులను అధికారులతో కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిషన్ భగీరథలోని వాటర్ ట్యాంక్ ఫిల్టర్ బెడ్ నిర్మాణాలను పరిశీలించారు. ఫిల్టర్ చేసిన పైపుల ద్వారా గ్రామాలకు నీటిని విడుదల చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పనుల విధానం గురించి అధికారులు ఎస్‌ఈ, డీఈ, ఏఈ కాంట్రాక్టర్లతో మిషన్ భగీరథ కార్యాలయంలో సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. ఎంతవరకు పనులు పూర్తయ్యాయి..? ఇంకా ఎంత వరకు పనులు మిగిలున్నాయని ఆరా తీశారు.