నిర్మల్‌ న్యాయస్థానానికి అక్బరుద్దీన్‌ తరలింపు

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ రిమాండ్‌ నేటితో ముగియనుంది. దీంతో ఆయన్ను ఈ ఉదయం నిర్మల్‌ న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు పోలీసులు తరలించారు.