నిర్మల్ లో ఘనంగా ఫ్రీడం రన్

 నిర్మల్ బ్యూరో, ఆగస్ట్13,,జనంసాక్షి,,    భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భార‌త స్వాతంత్య్ర‌ స్పూర్తిని ప్ర‌జ‌ల్లో నింపేందుకు, అమ‌రవీరుల త్యాగాల‌ను భ‌విష్య‌త్ త‌రాల‌కు తెలిజేసేందుకు వ‌జ్రోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీయం కేసీఆర్ -మంత్రి వర్యులు శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో ఫ్రీడం రన్ నిర్వహించారు.
జాతీయ గీతాలాపన చేసి,జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ,అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే ,రాంబాబుమున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ,జిల్లా ఇంచార్జ్ ఎస్పీ కిరణ్ ఖారే , గార్లు ఫ్రీడం రన్ ను ప్రారంభించారు.ఎన్టీఆర్ మినీ స్టేడియం నుండి ట్యాంక్ బండ్ ,ఓల్డ్ బస్ స్టాండ్,చింతకుంటవాడ,నగరేశ్వరా వాడ,ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం , మీదుగా కొనసాగింది.అధికారులు,ప్రజాప్ర తినిధులు, యువత,విద్యార్థులు,పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ జెండాలు పట్టుకోని భారత్ మాతా కీ జై.. అంటూ నినాదాలు చేశారు.15న ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
 

తాజావార్తలు