నిర్వాసితులకు మౌలిక వసతులు కల్పించాలి
గుంటూరు, జూలై 25 : పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్ అధికారులకు సూచించారు. రాజుపాలెం మండలంలో రాజుపాలెం, కొండమోడులోని పునరావాస కేంద్రాల్లో గృహ, రహదారుల నిర్మాణ పనులను సంయుక్త కలెక్టర్ యువరాజ్‌తో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ప్రతి నిర్వాసిత కేంద్రం వద్ద ఒక గుడికి, చర్చికి మాత్రమే స్థలం కేటాయిస్తామని నిర్వాసితుల విన్నపాలకు ఆయన జవాబు ఇచ్చారు. ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలని నిర్వాసితులు కోరారు. రాజుపాలెంలో గృహాలు నిర్మించుకోలేని పేదలకు ఆయన చేయూత నిస్తామన్నారు. విద్యుత్ సరఫరా, నీరు సక్రమంగా అందేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. కేంద్రాల్లో అనేక వీధులలో పర్యటించారు. వివాదస్థలాలను పరిశీలించి వాటి పరిష్కారానికి పలు సూచనలు చేశారు. నూతనంగా రూపుదిద్దుకున్న పాఠశాలలను పరిశీలించి వేగవంతంగా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించే విద్యార్థులను చేర్పించి తరగతులను ప్రారంభించాలన్నారు. నేటికి కొన్ని కేంద్రాల్లో ఇంకా ప్రారంభం కాని చర్చి, అంగన్‌వాడి కేంద్రాలను వేగవంతంగా నిర్మించాలని సూచించారు. ఆయన వెంట ప్రత్యేక ఉప కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ప్రశాంతి, శేషారెడ్డి, ప్రత్యేక కలెక్టర్ లక్ష్మయ్య, గృహ నిర్మాణ పిడి సురేష్, డిఈఈ శివలింగం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.