నిర్వాసితుల ధర్నా
ఆసిఫాబాద్ పట్టణం : మండలంలోని చిర్రకుంట, తుంపల్లి గ్రామాల మధ్య పులిఒర్రెపై నిర్మిస్తున్న చెరువులో భూములు కోల్పోయిన వారికి మరోచోట భూములను చూపాలంటూ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. సోమవారం స్థానిక సబ్ కలెక్టరు కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మంగు, కోట గొల్లన్నలు మాట్లాడుతూ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పరిహారం చెల్లించకుండా తమ భూముల్లో చెరువులు ఎలా నిర్మిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కోల్పోతున్న తమకు మరోచోట భూములు చూపే వరకు చెరువు నిర్మాణపనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.