నిర్వాహకుల నిర్లక్ష్యం- అధికారుల అలసత్వం..!!
కానరాని ఫుడ్ ఇన్స్పెక్టర్- అనారోగ్యానికి గురవుతున్న సామాన్యులు
– ఆహార పదార్థాల నాణ్యత పాటించని హోటల్ రెస్టారెంట్ నిర్వాహకులు
– పుట్టగొడుగుల్లా వెలుస్తున్న హోటల్- రెస్టారెంట్లు, పాస్ట్ పుడ్ సెంటర్లు
– కల్తీ ఆహార పదార్థాలతో అనారోగ్యానికి గురవుతున్న ప్రజలు
– ప్రజా ఆరోగ్యంపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న సంబంధిత అధికారులు
పరిగి, జూన్27(జనంసాక్షి) :
ప్రస్తుత సమాజంలో ఉరుకుల పరుగుల జీవితంలో రోజు రోజుకు ప్రజలు ఇంటి వంటలు చేసుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయనే చెప్పవచ్చు. ప్రజలు తమ తమ విధుల నిమ్మితం టిఫిన్ సెంటర్లలో టిఫిన్, రెస్టారెంట్లు, హోటల్లలో రెడీగా ఉన్న ఆహార పదార్థాలను లాగించేస్తున్నారు. నిర్వాహకులు పదార్థాల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించారో… లేదో అన్న విషయాలను మరిచి నోటికి రుచి ఉంటే చాలు కడుపు నింపుకుంటూ, అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు. హోటల్, రెస్టారెంట్ ల నిర్వాహకులు మాత్రం మాకు డబ్బులు వస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజలను ఆకట్టు కునేందుకు ఆహార పదార్థాల తయారీలో రుచి కోసం కల్తీ నూనెలు, రకరకాల మసాలాలు వాడుతున్నారనే చెప్పవచ్చు. పట్టణ కేంద్రంలో ఎలాంటి పరిమితులు లేకుండానే రోజు రోజుకు పుట్టగొడుగుల్లా హోటల్, రెస్టారెంట్లు, పాస్ట్ పుడ్ సెంటర్లు వెలుస్తున్నాయి. నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజలను ఆకట్టుకుంటూ అనారోగ్యాలకు గురి చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం మాకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తూ కన్నెత్తి చూసిన దాఖలాలు కూడా లేవు. దీనితో ప్రమాణాలు పాటించని హోటల్, రెస్టారెంట్, పాస్ట్ పుడ్ సెంటర్లు, బేకరిలను సందర్శిచి తనిఖీలు చేసేదెప్పుడో.. అన్న విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు హోటల్, రెస్టారెంట్లు, పాస్ట్ పుడ్ సెంటర్లలో తనిఖీలు చెప్పట్టి హోటల్, రెస్టారెంట్లు, పాస్ట్ పుడ్ సెంటర్ల నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని పలువురు మేధావులు కోరుతున్నారు.
– నాణ్యతా వైఫల్యాలపై చర్యలేవి
తరచూ హోటల్, రెస్టారెంట్లు, బేకరీ, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు ఆహార పదార్థాల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించక పోయిన సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే చెప్పవచ్చు. పట్టణంలోని ఓ హోటల్ లోని నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా బిర్యానీ లో రెండు ఈగలు దర్శనం ఇచాయి. అదేవిధంగా ఓ బేకరిలో కొనుగోలు చేసిన కేక్ లో వెంట్రుకలు కనిపించాయి. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. కల్తీ నూనెలు, కుళ్ళిన కూరగాయలు, శుభ్రత లేని వంట సామగ్రితో పాటు, వంట గదులలాంటి వాటితో నిర్వాహకులు కొనసాగిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ హోటల్, రెస్టారెంట్, పాస్ట్ పుడ్ సెంటర్లలో నిర్వాహకులు ఆహార పదార్థాల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా.. లేదా అని ఆహార పదార్థాల తనిఖీలపై ఏమాత్రం దృష్టి సారించడం లేదనే చెప్పవచ్చు.
– ధరలు ఎక్కువ- క్వాంటిటి తక్కువ
పట్టణంలోని హోటల్, రెస్టారెంట్లలో నిర్వాహకులు ఆహార పదార్థాల ధరలను ఎక్కువగాను.. క్వాంటిటి తక్కువగా ఇస్తూ ప్రజల జేబులకు చిల్లులు వేస్తున్నారు. ప్లేట్ బిర్యానీ కానీ, భోజనం కానీ, మాంసపు క్వాంటిటి ఇంతే ఉండాలనే నిబంధనలు హోటల్, రెస్టారెంట్, పాస్ట్ పుడ్ సెంటర్ల నిర్వాహకులకు అసలే పట్టవు. కనీస క్వాంటిటి ఉండేలా సంబంధిత అధికారులు పటిష్ట చర్యలు చేపట్టి ప్రజల సొమ్మును కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా వుంది.
– మున్సిపల్ శానిటేషన్ అధికారి పర్యవేక్షణ లోపం
పురపాలిక శాఖ షానిటేషన్ అధికారి పర్యవేక్షణ లేని కారణంగా పట్టణంలో నెలకొన్న హోటల్, రెస్టారెంట్, పాస్ట్ పుడ్ సెంటర్లలోని వంట శాలలు అపరిశుబ్రాంగా ఉండడమే కాకుండా రోజుల తరబడి నిల్వ ఉంచిన కూరగాయలపై బూజు వచ్చినా, కుళ్ళిన వాటితోనే ఆహార పదార్థాలు తయారుచేస్తూ నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ఎంతో మంది ప్రజలు రోగాల బారిన పడే అవకాశం లేకపోలేదు. వంట శాలలో కనీసం ఎలాంటి శుభ్రత ప్రమానాలు పాటించకుండా దర్జాగా హోటళ్లు నడిపించడం పట్ల అధికారులు ఎందుకు స్పందించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
– నాణ్యతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి
– సీపీఐ మండల కార్యదర్శి బి.మల్లేష్
ఆహారపదార్థాల నాణ్యత ప్రమానాలపై అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారించాలి. ఎదో ఒక చోట తిను పదార్థాల్లో ఈగలు, వెంట్రుకలు వంటివి కనిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టి ప్రజలు అనారోగ్యాలకు గురవ్వ కుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని సీపీఐ మండల కార్యదర్శి మల్లేష్ డిమాండ్ చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటల్, రెస్టారెంట్, పాస్ట్ పుడ్ సెంటర్ల నిర్వహకులపై సంబందిత అధికారులు చట్టపరమైన చర్యలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
———–
ఫొటో రైటప్, పరిగి,01 : పట్టణంలో నెలకొన్న ఓ హోటల్
ఫొటో రైటప్, పరిగి, 02 : ఓ హోటల్లో అపరిశుభ్రంగా ఉన్న వంట గది
ఫొటో రైటప్, పరిగి, 03 : సీపీఐ మండల కార్యదర్శి బి.మల్లేష్
———–
————
3 Attachments
|