నిలకడగా సీఐ,ఎస్సై ఆరోగ్యం:భువన గిరి ఎంపీ

హైదరాబాద్: నల్గొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడి హైదరాబాద్ం కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ బాలగంగిరెడ్డి, ఎస్సై సిద్ధయ్య ఆరోగ్య పరస్థితి నిలకడగా ఉందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. చికిత్స పొందుతున్న సీఐ,ఎస్సై ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పోలీసులు సాహసోపేతంగా వ్యవమరించారని తెలిపారు. సూర్యాపేటలో దొంగిలించిన కార్సైన్ తో కాల్పులు జరిపినట్లు చెప్పారు.