*నిలువ నీరు ఉంచుకోకుండా చూసుకోవాలి!
కార్యదర్శి ఫరీదా ఐలాపూర్
_________________________
లింగంపేట్ జూలై (జనంసాక్షి)
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలందరు జాగ్రత్తలు తీసుకోవాలని ఐలాపూర్ కార్యదర్శి ఫరీదాభేగం అన్నారు.ఆమె బుధవారం లింగంపేట్ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో యంపిడిఓ,సర్పంచ్ తుమ్మల్లపల్లి ధనలక్ష్మి ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.రోలు,పారేసేన టైర్లు తాగి పడేసిన కొబ్బరి బోండాలు బాటిల్స్ లో నీరు నిల్వ ఉంచుకోవద్దన్నారు.నిల్వ నీరు ఉన్న కుండిల నీరు పారపోయించి అవగాహన కల్పించారు.వర్షాకాలంలో మలేరియా డయేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.మురికి కాలువలో గడ్డి తొలగించి దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.స్కూల్ పరిసరాలు శుభ్రపరచారు.ఈ కార్యక్రమంలో ఏయన్ఎం,అంగన్వాడి టీచర్లు,ఆశ కార్యకర్తలు,గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area