నివర్‌ తుఫాన్‌ బాధిత రైతులను ఆదుకోవాలి: రామకృష్ణ

ఏలూరు,నవంబర్‌29 (జనం సాక్షి):   నివర్‌ తుఫాన్‌ విపత్తుని జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం నష్టం భరించాలని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో నష్టపోయిన పొలాలను ఆయన పరిశీలించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడారు. ‘పాడైపోయిన, మొలకెత్తిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయించాలి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. వరద బాధితులకు ముష్టి వేసినట్లు ప్రభుత్వం 500 రూపాయలు ప్రకటించింది.  ఎకరాకు 25 వేల చొప్పున రైతులకు పంట నష్టం ఇవ్వాలి. వరదలకు గురైన ప్రాంతంలో ఇంటికి 2000  ఆర్థిక సహాయం,  50 కేజీల బియ్యం తక్షణమే ఇవ్వాలి. సీఎం జగన్‌  ఏరియల్‌ సర్వే పేరుతో గాలిలో
పర్యటిస్తున్నారు. నేలవిూద తిరుగుతూ రైతుల కష్టాలు నేరుగా తెలుసుకొని వరద నష్టాన్ని గైడెన్స్‌ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి’ అని రామక?ష్ణ కోరారు.