నిషేధిత గుట్కా స్వాధీనం
పెద్దపల్లి ,నవంబర్17(జనంసాక్షి): సుందిళ్ల గ్రామంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న వ్యక్తిని రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత పొగాకు ఉత్పత్తుల విలువ సుమారు 28,060/- రూపాయలు ఉంటుందని అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసిపి (అడ్మిన్) అశోక్ కుమార్ ఆదేశాల ప్రకారం రామగుండం టాస్క్ ఫోర్స్ సీఐ జె.సరీలాల్ సిబ్బందితో కలిసి సుందిళ్లలోనీ అనంతుల చంద్రశేఖర్ కిరాణంలో దాడి చేసి వీటిని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో కిరాణా షాపు లో తనిఖీ చేయగా పొగాకు ఉత్పత్తులు ఉత్పత్తులు లభించాయని సీఐ జె. సరీలాల్ తెలియజేశారు. గుట్కాను స్వాధీనం చేసుకుని, నిందితుడిని గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.