నీరజ్ కుమార్‌కు ‘అశోక చక్ర’

 న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘చక్ర’ అవార్డులు ప్రకటించింది. ఆర్మీ అధికారి నీరజ్ కుమార్ సింగ్‌ను ఆయన మరణానంతరం ‘అశోక చక్ర’కు ఎంపికచేసింది. అలాగే ముగ్గురిని ‘కీర్తి చక్ర’, 12 మందిని ‘శౌర్య చక్ర’ అవార్డులతో సత్కరించనుంది. మొత్తం 374 మందికి శౌర్య పతకాలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీప్రకటించారు.

విధి నిర్వహణలో విశేష సేవలందించిన 28 మంది సీబీఐ అధికారుకు, 2013లో ఉత్తరాఖాండ్ వరద బాధితులకు సేవలందిస్తూ మరణించిన 15 మంది ఎన్డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ అధికారులకు, 967 మంది రక్షణ సిబ్బందికి రాష్ర్టపతి పోలీసు పతకాలను ప్రకటించారు.

జీవన్ రక్ష సర్వోత్తమ జీవన్ రక్ష అవార్డును నలుగురికి, ఉత్తమ జీవన రక్ష అవార్డును 17 మందికి, మిగిలిన 35 మందికి జీవన రక్ష అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బసవరాజ్ యారగట్టి సర్వోత్తమ జీవన రక్ష అవార్డుకు ఎంపికయ్యారు.