నుమాయిష్ ప్రపంచ స్థాయికి ఎదగాలి
` అత్యంత సేఫ్ సిటీగా హైదరాబాద్
` ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్(జనంసాక్షి): ప్రపంచీకరణ తర్వాత ప్రపంచం ఓ చిన్న గ్రామంగా మారిన నేపథ్యంలో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రపంచ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నాంపల్లిలో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. గత పాలకులు ఎగ్జిబిషన్ సొసైటీని ప్రోత్సహిస్తామని అనేక హావిూలు ఇచ్చారు కానీ అమలు చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సొసైటీ ప్రెసిడెంట్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సొసైటీని పెద్ద ఎత్తున విస్తరింపజేసి ఆదాయం సృష్టించుకుని, ఎగ్జిబిషన్ సొసైటీ ఆలోచనలను సఫలీకృతం చేయాలన్న పట్టుదలతో ఉన్నారని వివరించారు. నుమాయిష్ హైదరాబాద్ నగరానికే కాదు తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద ఉత్సవం అని అన్నారు. సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనతో ఉస్మానియా పట్టభద్రులు పబ్లిక్ గార్డెన్స్ లో మొదట 1938లో ఎగ్జిబిషన్స్ సొసైటీని ప్రారంభించారని వివరించారు. ఎగ్జిబిషన్ సొసైటీకి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కాటేజ్ , చేతివృత్తుల ఉత్పత్తిదారులు దేశం నలుమూలల నుంచి ఇక్కడ వచ్చి అమ్మకానికి పెట్టేవారు ఇది ఒక వ్యవస్థగా మొదలైంది అని తెలిపారు. ఇది కేవలం వ్యాపారం కాదు అనేక సంస్కృతుల మేలు కలయిక విభిన్న చేతివృత్తుదారులు వారి ఉత్పత్తులు కలా నైపుణ్యం ప్రదర్శనకు ఒక పెద్ద కేంద్రంగా మారడంతో క్రమక్రమంగా ఎగ్జిబిషన్ సొసైటీ పబ్లిక్ గార్డెన్స్ నుంచి 1936లో ప్రస్తుతం నాంపల్లిలో ఉన్న ప్రాంతానికి మారింది అన్నారు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఉత్పత్తిదారులు ఈ ఎగ్జిబిషన్ సొసైటీ కి వస్తారు శ్రీ రాజగోపాల చారి 1949 జనవరి మొదటి తేదీన స్వాతంత్రం అనంతరం ప్రారంభించారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని విద్యార్థుల చదువు, చేతివృత్తుల వారికి సహాయం అందించడం ప్రధానంగా మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకుని కమలాని పాలిటెక్నిక్ కళాశాలలు స్థాపించడం వంటి గొప్ప పనులు ఈ సొసైటీ చేయడం అభినందనీయం అన్నారు. లాభాపేక్ష లేకుండా పూర్తి నాణ్యతతో 19 విద్యాసంస్థలను సొసైటీ నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. హైదరాబాద్ వాసుల ప్రేమ, ఆప్యాయత, వాతావరణం, శాంతి భద్రతలు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు హైదరాబాద్ నగరంలో స్థిరపడడానికి ఆసక్తి చెబుతున్నారని ఇక్కడ ఉన్న విద్య, వ్యాపారం కోసం వచ్చిన వారు ఇక్కడే స్థిరపడుతున్నారని హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున విస్తరిస్తుందని డిప్యూటీ సీఎం వివరించారు. అన్ని వర్గాలు, మతాలు, ప్రాంతాల వారు వారికి కావలసిన విధంగా హైదరాబాదులో బతికే ఏర్పాటు చేసుకునే సౌకర్యం ఉందని డిప్యూటీ సీఎం అన్నారు.గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ను అత్యంత సేఫ్ నగరంగా రూపొందించాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. కాలుష్యరహితంగా, 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా, పూర్తి శాంతి భద్రతలతో కూడిన నగరంగా హైదరాబాదును రూపొందించే ఆలోచనలో ప్రజా ప్రభుత్వం ఉందని తెలిపారు అందులో సొసైటీ సభ్యులు భాగం కావాలని విజ్ఞప్తి చేశారు. లండన్ లోని థీమ్స్ ఉన్నది అభివృద్ధి ద్వారా పరిసర ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందాయో అదేవిధంగా మూసి నదిలో మంచినీరు ప్రవహింపచేసి పునర్జీవనం కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుందని, మూసి పరిసర ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని డిప్యూటీ సీఎం అన్నారు. వాతావరణ కాలుష్యం మూలంగా ఢల్లీి నగరంలో వారం రోజులు ఉండే పరిస్థితి లేదు ఆ పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. రాక్స్, శ్రీజీసబ, పార్కుల తో కూడిన నగరం హైదరాబాద్ ఇవి భవిష్యత్తు తరాలకు భద్రంగా అందించాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. నగరంలోని డీజిల్ బస్సులను దశలవారీగా బయటకు పంపి బ్యాటరీ బస్సులను ప్రవేశపెడుతున్నామని, ప్లాస్టిక్ రహిత నగరంగా హైదరాబాదును మార్చుతామని ఇటీవల సీఎం ప్రకటించిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. నగరం లోపల ఉన్న కాలుష్య కారకమైన ఇండస్ట్రియల్ పార్కులను అవుటర్ రింగ్ రోడ్డు బయటకు తరలించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు.

