నులు పురుగుల నివారణకు మాత్రలు వేసుకుంటే ఆరోగ్య కరం

.

– ఏఎన్ఎం విజయలక్ష్మి

 

అశ్వరావుపేట, సెప్టెంబర్ 15( జనం సాక్షి )జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమం గురువారం తిరుమల కుంట అంగన్వాడి 2 సెంటర్లో ఆల్బెండజోల్ 400 ఎంజి అనే నులి పురుగుల నివారణ మాత్రలు పిల్లలకు వేశారు. పిల్లలు ఆరోగ్యవంతులైతే చదువుతోపాటు అన్ని రంగాలలో రాణిస్తారని ఏఎన్ఎం విజయలక్ష్మి అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు ఆరోగ్యమే మహాభాగ్యం అని ముఖ్యంగా ఎదిగే పిల్లల వయస్సు అయిన సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయస్సు గ్రూపు పిల్లల ఆరోగ్యాన్ని మనం కాపాడినట్లయితే రేపటి ఆరోగ్యవంతమైన భారత సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుందని, దీనికి మనమందరము కృషి చేయాలని దీనికి గాను అవసరమైన వ్యక్తిగత పరిశుభ్రత ,పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. మంచి పోషకాహారం ముఖ్యంగా పిల్లల్లో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించడంద్వారా పిల్లలకు ఆ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని ,తద్వారా పిల్లలు శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు చదువుల్లో ఆటల్లో చక్కగా రాణించడానికి భారతదేశానికి పేరు తీసుకురావడానికి ఉపయోగపడతారని అన్నారు. పిల్లలు ఆహారం తీసుకునే ముందు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత కచ్చితంగా పరిశుభ్రంగా చేతులు కడుకోవాలని, వేడిఆహార పదార్థాలే భుజించాలని, పరిశుభ్రమైన నీరు త్రాగాలని, నులి పురుగుల నివారణకు సురక్షితమైన ఆల్బెండజోల్ మాత్ర తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థి మింగాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ కే రాజు, అంగన్వాడీ టీచర్ పల్లెల సత్యవతి, ఆశ కార్యకర్త నాగమణి,తదితరులు పాల్గొన్నారు.