నూతనంగా విష్ణు షాపింగ్ మాల్ ప్రారంభించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
కొండమల్లేపల్లి పట్టణంలో నూతనంగా విష్ణు షాపింగ్ మాల్ ప్రారంభించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొండమల్లేపల్లి అక్టోబర్ 10 జనం సాక్షి : కొండమల్లేపల్లి పట్టణంలో సాగర్ రోడ్డులో గల నూతన విష్ణు షాపింగ్ మాల్ ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ ఘనంగా ప్రారంభించారు విష్ణు కమర్షియల్ షాపింగ్ మాల్ ప్రారంభించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా కొండమల్లేపల్లి దేవరకొండ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఒక చక్కని సంతోషకరమైన విష్ణు కమర్షియల్ షాపింగ్ మాల్ కొండమల్లేపల్లి సాగర్ రోడ్డులో నూతన ప్రారంభోత్సవం చేశారు విష్ణు షాపింగ్ మాల్ లో రిలయన్స్ స్టార్ట్ పాయింట్( సూపర్ మార్కెట్), రోమన్ ఐలాండ్, రిలయన్స్ ట్రెండ్స్, బ్రాండెడ్ షూ మార్ట్, గోల్డెన్ బేకరీ, విష్ణు ఏసీ ఫంక్షన్ హాల్, విష్ణు ఏసీ లాడ్జ్, జీవి సినీప్లెక్స్( 2 థియేటర్స్ ) ఇంకా మీ యొక్క గృహ అవసరాలకు ఆర్థిక అవసరాలను తీర్చే మరియు వినోదం కలిగించే వివిధ రకాల వ్యాపార సముదాయాలు, బ్యాంకులు వస్తున్నాయని తెలియజేయుటకు సంతోషిస్తున్నామన్నారు ప్రజలందరూ ఒకే చోట ఇన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు మరియు విష్ణు షాపింగ్ మాల్ యాజమాన్యాన్ని అభినందించారు ఒక మారుమూల ప్రాంతంలో పట్టణాలకు దీటుగా ఇలాంటి కమర్షియల్ షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయడం సంతోషకరమని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్, కొండమల్లేపల్లి సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్, కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, జడ్పిటిసి సరస్వతమ్మ, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య , పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, దేవరకొండ ఎంపీపీ నల్లగాసు జానీ యాదవ్, వైస్ చైర్మన్ రాహత్ అలీ, కొండమల్లేపల్లి ఎంపీటీసీ వసుకుల తిరుపతమ్మ కాశయ్య, విష్ణు షాపింగ్ మాల్ మేనేజింగ్ పార్ట్నర్స్ పానుగంటి మల్లయ్య, చీదెళ్ళ వెంకటేశ్వర్లు, సముద్రాల జ్ఞానేశ్వర్, దేశిరామ్, దొడ్డి వెంకటేశ్వర్లు,దొడ్డి అశోక్, శీలా వెంకన్న మరియు కొండమల్లేపల్లి వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, కొండమల్లేపల్లి ఉప సర్పంచ్ గంధం సురేష్, రైతుబంధు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్యా దేవేందర్ నాయక్, పసునూరు యుగంధర్ రెడ్డి, నాయిని మాధవరెడ్డి, శీలా వెంకయ్య, గుండెబోయిన లింగం యాదవ్, బద్దు నాయక్, వూరే జనార్ధన్, గౌరు వెంకటేశ్వర్లు, చందా ధనుంజయ, అంకిశెట్టి శేఖర్, గందె పురుషోత్తం, కుంచకూరి లక్ష్మణ్ వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, ఆర్యవైశ్య సోదరులు, వ్యాపారవేత్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు