నూతన జట్టు లక్ష్యాలను అధిగమించగలదు: మన్మోహస్‌సింగ్
ఢిల్లీ: రాబోయే రోజుల్లో ఎదుర్కొనే సవాళ్లను నూతన జట్టు సమర్థంగా అధిగమించగలదని ప్రధాని మన్మోహస్‌సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత మంత్రి వర్గం యువత -అనుభజ్ఞుల సమ్మిళతమన్నారు..2014 ఎన్నికల ముందు ఇదే ఆఖరి మంత్రి వర్గ విస్తరణ కావొచ్చన్న ఆయన పదవులు కోల్పోయిన వారి అవసరం పార్టీకి ఎంతో ఉందని, పార్టీ వారికి సముచిత స్థానాన్ని ఇస్తుందని మన్మోహన్ తెలియజేశారు.