నూతన డీజీపీగా సీవీ ఆనంద్

` ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
` 30న పదవీ విరమణ చేయనున్న శివధర్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యÖపీఎస్సీ ఎంపానెల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం సీవీ ఆనంద్ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన డీజీపీగా ప్రమోషన్ పొందనున్నారు. ఈ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ నియామకం అమల్లోకి వస్తుంది. తెలంగాణ ప్రస్తుత డీజీపీ కె. శివధర్ రెడ్డి ఈనెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ బాస్‌గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఏప్రిల్ నెలాఖరులో ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ ఎంపిక అనివార్యమైంది. అందుకు రాష్ట్రంలోని సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు జాబితాను ఇటీవల యÖపీఎస్సీ.. రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఆ జాబితాలో 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌తోపాటు 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రా ఉన్నారు. వారిలో సీనియర్ అయిన సీవీ ఆనంద్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీగా ఎంపిక చేసింది.